రాష్ట్ర‌వ్యాప్తంగా బాబూజీ జ‌యంతి వేడుక‌లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్‌సీపీ కార్యాల‌యాల్లో జ‌గ్జీవ‌న్ రామ్ చిత్ర‌ప‌టానికి పూలమాల‌లు వేసి నివాళులు అర్పించారు.


శ్రీకాకుళం జిల్లా లో జ‌గ్జీవ‌న్ రాం జ‌యంతి వేడుక‌ల్ని పార్టీ నాయ‌కులు నిర్వ‌హించారు.
విజ‌య న‌గ‌రం జిల్లాలో పెద్ద ఎత్తున ద‌ళిత మ‌హానేత జ‌యంతి వేడుక‌లు పార్టీ కార్యాల‌యంలో జ‌రిగాయి. సాలూరు లో బాబూజీ విగ్ర‌హానికి ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర పూల మాల వేసి నివాళులు అర్పించారు.
విశాఖ‌ప‌ట్నం లోని బీచ్ రోడ్ లో ఉన్న జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం పాటు ప‌డిన నాయ‌కుడ‌ని జిల్లా పార్టీ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్ నాథ్ అన్నారు. నియోజ‌క వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు.
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వ‌ర్యంలో బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌లు జ‌రిపారు. ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి అంజ‌లి ఘ‌టించారు.
క్రిష్ణా జిల్లా లో జ‌రిగిన జ‌యంతి వేడుక‌ల‌కు మాజీ మంత్రి, పార్టీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ సార‌ధి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాబూ జగ్జీవ‌న్ రామ్ సేవ‌ల్ని ఆయ‌న ప్ర‌స్తుతించారు. 
గుంటూరు లో జ‌రిగిన జ‌యంతి వేడుక‌ల‌కు మాజీమంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఉన్న బాబూ జగ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పార్టీ జిల్లా అధ్య‌క్షుడు మర్రి రాజ‌శేఖ‌ర్ పూల మాల వేసి నివాళి అర్పించారు. ద‌ళితుల‌కు ఆయ‌న చేసిన సేవ‌ల్ని కొనియాడారు.
ప్ర‌కాశం జిల్లా పార్టీ కార్యాల‌యంలో జగ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ద‌ళితులు, అణ‌గారిన వర్గాల అభ్యున్న‌తి కోసం నిరంత‌రం పోరాడిన వ్య‌క్తి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ అని పేర్కొన్నారు.నాలుగు ద‌శాబ్దాల పాటు కేంద్ర‌మంత్రిగా సేవ‌లు అందించి ఎన్నో నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన మ‌హానేత బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ అని వివ‌రించారు.
నెల్లూరు జిల్లాలో జ‌రిగిన బాబూ జ‌యంతి వేడుక‌ల్లో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాద‌వ్‌, కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. జ‌గ్జీవ‌న్ రామ్ సేవ‌ల్ని గుర్తుచేసుకొన్నారు.
చిత్తూరు జిల్లా లో బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి ని నిర్వ‌హించారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్య‌క్షులు నారాయ‌ణ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.
అనంత‌పురం జిల్లా లో జయంతి వేడుకల‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్ రెడ్డి హాజ‌ర‌వ‌గా, వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు లో జ‌రిగిన ఉత్స‌వాల‌కు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు నేతృత్వం వ‌హించారు. 
Back to Top