బాబు ప్రలోభాలను బయటపెట్టిన గిడ్డి ఈశ్వరి

విశాఖపట్నం(కొయ్యూరు): టీడీపీలోకి వస్తే తనకు మంత్రి పదవితో పాటు కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు సిద్ధపడ్డారని  వైఎస్సార్‌సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. విశాఖ జిల్లా కొయ్యూరు జిల్లాపరిషత్ అతిథిగృహం వద్ద నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిల్లోనూ లొంగే ప్రసక్తే లేదని, ఎప్పటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను నేరుగా సీఎంతోనే పోరాటం చేస్తున్నానన్నారు

Back to Top