బాబు నోరు విప్పితే అబద్దాలే

హైదరాబాద్ః చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏకగ్రీవంగా గెలిచానని చెప్పడం హేయనీయమన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపీడీ చేస్తున్నారని ఆగ్రహించారు. బాబు అవినీతిని అడ్డుకుంటే... ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటుందంటూ బురజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. బాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని దుయ్యబట్టారు. లోకేష్ కు దోచిపెట్టేందుకు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని నిప్పులు చెరిగారు.

Back to Top