బాబుకు ప్రజలు ఉసురు తగులుతుంది

  • రైతులను దారుణంగా వంచించాడు
  • బాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే
  • పులివెందులలో పర్యటిస్తున్న వైయస్ జగన్
  • తుమ్మలపల్లిలో ఎండిన చినీపంటల పరిశీలన
  • జననేతను కలిసిన పసుపు రైతులు
  • రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్
వైయస్ఆర్ జిల్లాః తొండూరు మండలం తుమ్మలపల్లిలో ఎండిపోయిన చినీ తోటలను వైయస్ జగన్ పరిశీలించారు. లింగాల, సింహాద్రిపురం ఎక్కడ చూసినా చినీచెట్లు చనిపోయే పరిస్తితి ఉంటే,  పులివెందులకు బ్రహ్మాండంగా నీళ్లిచ్చాం రైతులు శావుకార్లు అయిపోయారని టీడీపీ నేతలు మాట్లాడడంపై వైయస్ జగన్ మండిపడ్డారు. ఎండిపోయిన చినీ పంటలకు  ఏం సమాధానం చెబుతావని  వైయస్ జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.  బాబు మోసాలకు రైతులు అతలాకుతలమవుతున్నారని, చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు.  పైడిపాలెం డ్యాం కెపాసిటీ 6 టీఎంసీలయితే, పాయింట్ 3 టీఎంసీలు తీసుకొచ్చి చెట్లు కాపాడామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకోవడంపై వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చిత్రావతి డ్యాం కెపాసిటి 10 టీఎంసీలుంటే.....కేవలం  ఒకటిన్నర  టీఎంసీ తాగునీటికి, పాయింట్ 2 టీఎంసీ సాగునీటికి ఇచ్చి పులివెందుల సస్యశ్యామలం చేశానని బాబు గొప్పలు చెప్పుకోవడాన్ని వైయస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. 6 టీఎంసీలకు పాయింట్ 3 టీఎంసీలు, 10 టీఎంసీలకు పాయింట్ 2 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇచ్చి రైతులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారని టీడీపీ నాయకులు చెప్పడం పట్ల వైయస్ జగన్ ఫైర్ అయ్యారు.  ఇక్కడ ఇంత కరువున్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం  ముందుకు రాకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 

రుణమాఫీ విషయంలో చంద్రబాబు చేసిన జిమ్మిక్కుల కారణంగా రైతులు రూ. 2 అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వైయస్ జగన్ అన్నారు. రైతులు రుణాలు కట్టని కారణంగా బ్యాంకుల్లో డబ్బులు పుట్టక బంగారం వేలం వేస్తున్న పరిస్థితి ఉంటే, రుణాలన్నీ మాఫీ చేశానని బాబు పచ్చి అబద్ధాలు చెబుతూ రైతుల నడ్డివిరుస్తున్నాడని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ. 87, 612 కోట్లు వ్యవసాయ రుణాలుంటే, వాటి వడ్డీ ఏడాదికి 16వేల కోట్లు ఉందన్నారు. అసలు సంగతి దేవుడెరుగు ఈ మూడేళ్లలో వడ్డీయే  48వేల కోట్లు ఉంటే బాబు ఏడాదికి కనీసం రూ. 3వేల కోట్లు కూడ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 2015-16లో  మరీ దారుణంగా 745కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. 
 
పులివెందులలో పసుపు రైతులు వైయస్ జగన్ ను కలిశారు. పంటలకు గిట్టుబాటు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ హయాంలో క్వింటా రూ. 16వేల ధర ఉంటే ప్రస్తుతం రూ.4,500కు పడిపోయిందని వైయస్ జగన్ అన్నారు. ఇలా ఉంటే రైతులు ఎలా బతుకుతారని చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే పసుపు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్చి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని,  యార్డుకు పోయి ధర్నాచేయని రైతు, ప్రతిపక్ష నాయకుడే లేడన్నారు. రూ. 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకుంటానని చెప్పిన పెద్దమనిషి నిధి లేదు, ఆదుకున్నది లేదని బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అక్కచెల్లెమ్మలను దారుణంగా వంచించాడని , బాబు నోరు తెరిస్తే అబద్ధాలు మోసాలేనని దుయ్యబట్టారు.మోసపూరిత పాలన సాగిస్తున్న బాబుకు దేవుడు మొట్టికాయలు వేస్తాడని అన్నారు. బాబుకు ప్రజల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

Back to Top