విభజనకు కుట్ర చేసి మాపై నిందవేస్తారా !

కడప 02 ఆగస్టు 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించి ఆ నిందను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్  వైయస్ఆర్ సమైక్యవాదో...కాదో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగేస్తే తెలుస్తుందన్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి....సోనియా గాంధీ కాళ్లు మొక్కి తిరిగి వచ్చారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఎగతాళి చేశారు. మరోవైపు విజభనను నిరసిస్తూ  వైయస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్లలో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేయగా, తోటి విద్యార్థులు అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  పులివెందులలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు.  సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యవాదులు తహసీల్దారు కార్యాయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజంపేటలోనూ రాజకీయ వర్గాలు ర్యాలీ చేపట్టాయి. దుకాణాలను శుక్రవారం కూడా స్వచ్ఛందంగా మూసి ఉంచారు.

Back to Top