చంద్రబాబు దేశద్రోహి

()బాబు కరప్షన్ కు కన్నబిడ్డ..కమీషన్లకు ముద్దుబిడ్డ 
()నాయుళ్లు ఇద్దరూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు
()బాబు మానసిక పరిస్థితిపై ట్రీట్ మెంట్ జరగాల్సిందే
()లోకేష్ సిమ్ కార్డు లేని ఫోన్ లాంటి వాడు
()వైయస్ జగన్ దమ్మున్న నాయకుడు
()బాబుకు దమ్ముంటే తన అవినీతిపై విచారణకు సిద్ధపడాలి
()వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సవాల్

హైద‌రాబాద్‌: చిత్తూరు జిల్లా న‌గరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే బ్లాక్‌మ‌నీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌.... చీటింగ్‌కు చీర్‌గాళ్... క‌రప్ష‌న్‌కు క‌న్న‌బిడ్డ‌.... క‌మీష‌న్ల‌కు ముద్దుబిడ్డ అని రోజా విమర్శలు గుప్పించారు.  వెంక‌య్య‌, తాను అమెరికాలో పుట్టి ఉండాల్సిందన్న బాబు వ్యాఖ్య‌ల‌పై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఇత‌ర రాష్ట్రాల్లో అయితే బాబును దేశ‌ద్రోహం కింద రాజీనామా చేసే వ‌ర‌కు వ‌దిలి పెట్టేవారు కాద‌ని ఆమె పేర్కొన్నారు. చంద్ర‌బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టినందుకు మ‌న‌మంతా సిగ్గు ప‌డాల‌ని రోజా అన్నారు. చంద్ర‌బాబుకు త‌న త‌ల్లిదండ్రులు, రాజ‌కీయ బిక్ష పెట్టిన కుప్పం, ప్రాణాలు కాపాడిన తిరుప‌తి వెంక‌న్న‌స్వామి గుర్తుకు రాలేద‌ని... కేవ‌లం వెంక‌య్య‌నాయుడు మాత్ర‌మే గుర్తుకు రావడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వెంక‌య్య‌, బాబులు అవిభ‌క్త క‌వ‌ల‌లు అన‌డానికి ఇంత‌క‌న్నా మ‌రో నిద‌ర్శ‌నం లేద‌ని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్నిస‌ర్వ‌నాశ‌నం చేయ‌డంలో ఒక‌రికొక‌రు తోడు ఉన్నార‌ని, ఇప్పుడు అమెరికాను నాశ‌నం చేయ‌ాలని చూస్తున్నార‌ని అన్నారు. దేశద్రోహానికి పాల్పడిన చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. 


బాబుకు చికిత్స చేయించాలి
చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు వింటుంటే ఆయ‌న మాన‌సిక ప‌రిస్థితిపై ప్ర‌జ‌ల్లో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయని రోజా పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉండి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని,  బాబుకు వైద్యం చేయించాల‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను రోజా కోరారు. అవ‌కాశం ఉంటే నేను వెంక‌య్య అమెరికాలో పుట్టే వాళ్లం... ఎస్సీలో పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా... కోడ‌లు మ‌గ బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటుందా.?.. మ‌న వాళ్లు స్ల‌మ్ నిర్మిస్తారు.. మురికివాడ‌ల్లో ఉంటే మురికి ఆలోచ‌న‌లే వ‌స్తాయి... ఇంజ‌నీర్ల‌కు క‌మిట్‌మెంట్ లేదు... డ‌బ్బులుంటే ఏ స‌మ‌స్య ఉండ‌దు... డ‌బ్బులు లేక‌పోతే బీసీల‌మ‌ని గుర్తుకు వ‌స్తాయి. రైతులు వ‌రుణుడిని న‌మ్మారు. న‌న్ను న‌మ్మ‌లేదు అందుకే క‌రువు వ‌చ్చింది. అయ్య‌ప్ప స్వాముల వాళ్ల లిక్క‌ర్ అమ్మ‌కాలు త‌గ్గిపోతున్నాయ‌ని చంద్రబాబు మాట్లాడ‌డం సిగ్గు చేట‌న్నారు. 

రెండుఎక‌రాల బాబు ఎక్క‌డ మొద‌ల‌య్యారు..?
మురికివాడ‌ల్లో ఉంటే స్ల‌మ్స్ క‌డ‌తార‌న్న చంద్ర‌బాబు తాను రెండు ఎక‌రాల నుంచే వచ్చారన్న విష‌యం మ‌ర్చిపోతున్నార‌న్నారు. ప్ర‌పంచ దేశాల్లో గొప్ప‌గొప్ప క‌ట్టడాలు తెలుగువారు క‌డుతున్నార‌ని రోజా పేర్కొన్నారు. నాసాలో సైతం 50శాతానికి పైగా భార‌తీయ ఇంజ‌నీర్లు ఉన్నార‌న్నారు. చంద్ర‌బాబుకు ఆడ పిల్ల‌లు లేరు కాబ‌ట్టే మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం తెలియ‌ద‌న్నారు. తెలుగు ప్ర‌జ‌లంటే బాబుకు ఎందుకు అంత చుల‌క‌నో అర్థం కావ‌డం లేద‌న్నారు.  బాబుకు విదేశీ మోజు ఉంది కాబ‌ట్టే రాజ‌ధాని నిర్మించుకొని 30 సంవ‌త్స‌రాలు అమ్ముకునే అవ‌కాశాన్ని సింగ‌పూర్‌కు ఇచ్చారని దుయ్యబట్టారు. చైనాకు 972 కిలోమీట‌ర్ల‌లో పోర్టు కోసం కేటాయించ‌డం, ర‌ష్యా న్యూక్లియ‌ర్ ప్లాంటు అన్ని చోట్ల మూసేసుంటే ఏపీలో అవ‌కాశం ఇవ్వ‌డంలో అంత‌ర్యం ఏమిట‌నీ రోజా బాబును ప్ర‌శ్నించారు. ఎకాన‌మిక్స్‌లో పీహెచ్‌డీ చేశాన‌ని బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.  మ‌న‌కు గాడిద‌లు వ‌ద్దు సింగ‌పూర్ గుర్రాలు కావాలంటూ బాబు భారతీయులను అవమానించడంపై రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు గొప్పద‌నం గురించి ప్ర‌పంచ దేశాల‌కు చాటిచెప్పిన ఎన్టీఆర్ పార్టీలో ఉంటూ తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని బాబు కించ‌ప‌ర్చ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. క్రేజీవాల్ చేసిన చిన్న వ్యాఖ్య‌కు దేశ‌ద్రోహిగా ప్ర‌చారం చేసిన మీడియా,  అమెరికాలో పుట్టాల‌ని కోరుకుంటున్నానన్న చంద్రబాబుపై కూడా దేశ‌ద్రోహిగా ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. 

ఉమ అంటే ఆడా..? మ‌గ‌ా..?
చంద్ర‌బాబు త‌న అవినీతి బాగోతం నుంచి బ‌య‌ట ప‌డేందుకు త‌న పెంపుడు రాజ‌కీయ నాయ‌కుడు దేవినేని ఉమను ఉసిగొల్పుతున్నార‌ని, అస‌లు ఉమ అంటే ఆడ‌ా, మ‌గో తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. 

సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మేనా?
బాబు రాయ‌ల‌సీమ గ‌డ్డ‌మీద పుట్టి ఉంటే జ‌గ‌న్‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు నిరూపించాల‌ని, లేనిప‌క్షంలో రాజ‌ధాని భూకుంభకోణం, స‌దావ‌ర్తి భూములు, విద్యుత్ అక్ర‌మ కొనుగోలుపై సీబీఐ విచార‌ణ‌కు సిద్ధపడాలని బాబుకు స‌వాల్ విసిరారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఏ త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టే ఎలాంటి స్టేలు తెచ్చుకోకుండా ద‌మ్మున్న నాయ‌కుడిగా నిల‌బ‌డ్డార‌ని రోజా పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ ను రాజ‌కీయ స‌మాధి చేయాల‌న్న కక్షతోనే ఎర్ర‌న్నాయుడు, శంక‌ర్‌రావులు క‌లిసి కేసులు పెట్టార‌ని రోజా అన్నారు. కాంగ్రెస్‌కు తొత్తుగా ఉన్న చంద్ర‌బాబు త‌న కేసుల నుంచి త‌ప్పించుకున్నార‌న్నారు. ఎటువంటి అవినీతికి పాల్ప‌డ‌కపోతే కొడుకు, కొడ‌లు, భార్య పేర ఉన్న ఆస్తుల‌పై సీబీఐ విచార‌ణ వేసేందుకు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నార‌ని బాబును నిల‌దీశారు. టీడీపీ అవినీతిపై అన్ని పార్టీలు పుస్త‌కాలు ప్ర‌చురించిన విష‌యాన్ని రోజా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. బాబుపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో ఒక్క‌దానిపైన సీబీఐ విచార‌ణ జ‌రిగినా జీవితాంతం జైల్లో కూర్చొవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌న్నారు.

లోకేష్..డిక్కీ బలిసిన కోడి
లోకేష్ సిమ్‌కార్డులేని సెల్‌ఫోన్ లాంటివాడ‌ని, బిల్డ‌ప్‌లు ఎక్కువ బిజినెస్ త‌క్కువ... ప‌బ్లిసిటీ ఎక్కువ, ఫర్ప‌ార్మెన్స్ త‌క్కువ అని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మండ‌ల క‌మిటీని ఎలా నియ‌మిస్తారో కూడా తెలియ‌ని వ్య‌క్తి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌డం తెలుగుత‌మ్ముళ్లు చేసుకున్న దుర‌దృష్ట‌మ‌న్నారు. ఇటువంటి లోకేష్ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి పోటీ అన‌డం హాస్య‌ాస్ప‌దంగా ఉంద‌న్నారు. లోకేష్ వ్యవహారం డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుముందు తొడగొట్టినట్టుందని ఎద్దేవా చేశారు. 

ద‌మ్మున్న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌
చంద్ర‌బాబు, న‌రేంద్ర‌మోడీ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లు క‌లిసి వ‌చ్చినా ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డిన ద‌మ్మున్న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అన్న విష‌యం లోకేష్ తెలుసుకోవాల‌ని సూచించారు. వార్డు మెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌ని లోకేష్ అడ్డ‌దారిలో మంత్రి కావాల‌ని చూస్తున్నార‌న్నారు. భార‌తీయులను అవమానించినందుకు దేశ పౌరులంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పి, భార‌త‌మాత కాళ్లు ప‌ట్టుకోవాల‌ని చంద్రబాబును డిమాండ్ చేశారు.  తన అవినీతి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌త్యేక హోదాను కేంద్రానికి, న‌దుల‌ను తెలంగాణ‌కు తాకట్టు పెట్టిన మోసకారి చంద్ర‌బాబు అని రోజా విరుచుకుపడ్డారు. తెలుగు ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తున్న బాబును తరిమేయాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. 
Back to Top