తిరుమల పవిత్రతను మంట గలుపుతున్నారు- కారుమూరు నాగేశ్వరరావు

సంప్రదాయాలను తుంగలో తొక్కే
విధంగా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి పవిత్రతను మంటగలుపుతోందని మాజీ
ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు విమర్శించారు. సన్నిధి గొల్లలు తొలిగా తలుపులు
తీసే కార్యక్రమం అనాదిగా వస్తోంది దానిని తొలగించారనీ, ఇప్పుడు ప్రధాన అర్చకుల
విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు తన
పాలనలో అన్ని వ్యవస్థలను పాడు చేశారు, అదే తరహాలో తిరుపతిలోనూ వ్యవహరించడం
ఎంతమాత్రం భావ్యం కాదు. గుడి పవిత్రతను యాదవులందరూ ఆందోళనలు చేస్తే, యాదవ ప్రజలను
మిమ్మల్ని క్షమించరన్నారు. యాదవలుందరూ సన్నిధి గొల్లలను కొనాగించాలని ఆందోళన
చేస్తున్నారు. టిటిడి ఛైర్మన్ సుధాకర్ యాదవ్ తనకు పదవి ముఖ్యమో, యాదవులకు,
అర్చకులకు అన్యాయం చేయడమే లక్ష్యమా తేల్చుకోవాలన్నారు. ఇకనైనా తమధోరణిని
మార్చుకోకుంటే ప్రజా ఉద్యమంతో  ఆగ్రహానికి
గురికాక తప్పదని హెచ్చరించారు. 

Back to Top