బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారుః వైయస్ జగన్

అనంతపురంః ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేందుకే బాబు రెయిన్ గన్ ల డ్రామా ఆడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. జిల్లాకు వస్తున్నప్పుడు ప్రతీ ఎకరా చూసుకుంటూ వచ్చానని,  అంతా ఎండిపోయిన పరిస్థితి ఉందని వైయస్ జగన్ అన్నారు. ఇది బాబుకు, వ్యవసాయశాఖ మంత్రికి కనబడకపోవడం దారుణమన్నారు. ఇంత దారుణంగా కరువు తాండవిస్తుంటే సిగ్గులేకుండా 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలు కాపాడానని బాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నాలో పాల్గొని ప్రసంగించారు.

Back to Top