భూములు మింగేసేందుకు బాబు కుట్రలు

నెల్లూరు : కృష్టపట్నం భూములను కొట్టేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్దన్రెడ్డి మండిపడ్డారు. కృష్ణపట్నం ఎరువుల ఫ్యాక్టరీ కోసం చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముందని బాబును ప్రశ్నించారు. గ్యాస్ లేకుండా పరిశ్రమ ఎలా వస్తుందో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. 

టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన కేవలం ప్రచార ఆర్భాటమే అని  కాకాని గోవర్దన్రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవంగా రైతులకు రుణమాఫీ జరగడం లేదని చెప్పారు.  నెల్లూరులో కాకాని విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హామీలు విస్మరించిన చంద్రబాబు బేషరతుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
Back to Top