కోట్లు దండుకోవ‌డ‌మే బాబు ల‌క్ష్యం

తిరుప‌తి: అధికారంలో ఉన్నంత కాలం రూ. వేల కోట్లు దండుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్య‌క్షులు, గంగాధ‌ర నెల్లూరు ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి మండిప‌డ్డారు. కొత్త రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు వేల ఎక‌రాల రైతుల భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కొని విదేశీ కంపెనీల‌కు, కార్పొరేట్ సంస్థ‌ల‌కు రూ. వేల కోట్ల‌కు అమ్ముకుంటూ రియ‌ల్ దందాకు పాల్ప‌డ్డాడ‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అదీ చాల‌క చివర‌కు విజ‌య‌వాడ‌లో రోడ్డు విస్త‌ర‌ణ‌ల పేరుతో దేవ‌దాయ‌శాఖ భూముల‌ను సైతం అక్ర‌మించుకుంటూ భూబ‌కాసురుడుగా మారాడ‌ని ఆరోపించారు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ఆల‌యాల కూల్చివేత‌పై పీఠాధిప‌తులే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు తీరుకు నిర‌స‌న‌గా మ‌ఠం పీఠాధిప‌తులు ధర్నాకు దిగుతుండ‌డం చంద్ర‌బాబు ప‌తనానికి నాంది అన్నారు. దేవుడి భూముల‌ను క‌బ్జా చేయ‌డ‌మే కాకుండా ఆల‌యాల‌ను కూల్చివేసిన చంద్ర‌బాబుకు దేవుడే త‌గిన బుద్ధి చెబుతార‌న్నారు. 
Back to Top