బాబు నీచ రాజకీయాలు ఆపు

కర్నూల్ జిల్లా వైయస్సార్ పార్టీ  రైతు విభాగం అధ్యక్షులు శివరామి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత  రాజశేఖరుడు చేపట్టిన జలయజ్ఞం తామే మొదలు పెట్టి పూర్తి చేశాము అని చెప్పుకోవడం ...చంద్రబాబు నాయుడు నీచ సంసృతికి నిదర్శనం అని మండిపడ్డారు. రాష్ట్రంలో జలయజ్ఞం ఎవరు మొదలు పెట్టారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికి తెలుసునని అన్నారు.  ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వైయస్ఆర్  95శాతం పనులు పూర్తి చేశారని,  కేవలం 5 % పనులను పూర్తి చేసి తామే పూర్తి చేశాం అని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయమే దండగన్న ముఖ్యమంత్రి ప్రాజెక్టులు కట్టానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పేద ప్రజల కష్టాలు ,రైతన్నల కలలు సాకారం కావాలంటే రాజన్న తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయితేనే సాధ్యం అని వారు అన్నారు.  ఎన్నికలు ఎప్పుడు జరిగిన అత్యదిక మెజార్టీ స్థానాలు గెలిచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు.

Back to Top