ధర్మయుద్ధం అనడం హాస్యాస్పదం


ఢిల్లీ: చంద్రబాబు ధర్మయుద్ధం చేస్తాననడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. 29సార్లు ఢిల్లీకి వచ్చి ఏం సాధించారని చంద్రబాబు మళ్లీ వచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీకి వచ్చారన్నారు. పూర్తిగా అవినీతితో కూరుకుపోయిన చంద్రబాబు.. నాలుగేళ్లు ప్రత్యేక హోదాను పక్కనబెట్టి ఇప్పుడు కేంద్రంపై ధర్మయుద్ధం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసుల మాఫీ కోసం.. ఓట్ల కోసం వచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు కూడగట్టడానికి వచ్చానని చెప్పడం హేయనీయమన్నారు. మీడియా వారి చేతిలో ఉందని డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పూర్తిగా అవినీతితో కూరుకుపోయిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. 
 
Back to Top