కేంద్రానికి అమ్ముడుపోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు

హైదరాబాద్ః  ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి బాబు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాశారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పోలవరాన్ని నిర్మించే బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ...దోపీడీ కోసం బాబు హోదాను పణంగా పెట్టి పోలవరాన్ని పట్టారని నిప్పులు చెరిగారు.  రాష్ట్రానికి హోదా ఇవ్వమని కేంద్రం చెబుతుంటే...చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పడం దుర్మార్గమన్నారు. బాబు తన స్వార్థ ప్రయోజనాలు, అవినీతి కోసం రాష్ట్రాన్ని ఏవిధంగా తాకట్టు పెట్టారో....కేంద్రానికి ఏవిధంగా అమ్ముడుపోయారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

Back to Top