హైదరాబాద్ః ప్రతిదానికి సై అని మాట్లాడే చంద్రబాబు...రాజధాని భూములపై విచారణకు ఎందుకు నై అంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కోటంరెడ్డి మాట్లాడారు. టీడీపీ రాజధాని భూముల దోపిడీపై రిజస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తో ఆధారాలతో సహా చూపిస్తే ఇంకేం ఆధారాలు కావాలని నిలదీశారు. ఇది ఏ అమెరికానో, రష్యాకో చెందినవి కాదని ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని అన్నారు. మాట్లాడితే అపార అనుభవం అని మాట్లాడే చంద్రబాబు...రాజధాని భూదురాక్రమణపై విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని ఫైరయ్యారు. <br/>భూదందా వెనుక చిదంబర రహస్యమేంటో ప్రజలకు చెప్పాలని కోటంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణకు ఆదేశిస్తే ప్రజలకు వాస్తవాలు తెలిస్తాయన్నారు. సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబు విచారణకు సిద్ధపడాలన్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే స్పీకర్ మైక్ కట్ చేసి ప్రతిపక్షం గొంతునొక్కారు. ప్రభుత్వ బండారాన్ని తొక్కిపెట్టేందుకు అధికారపార్టీకి కొమ్ముకాశారు.