సిగ్గుశరం ఉంటే చంద్రబాబు రాజీనామా చేయాలి- కొడాలి నాని

విజయవాడ: చంద్రబాబుకు సిగ్గుశరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని కోడాలి నాని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి చంద్రబాబు పాలన సాగుతుందన్నారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి దోచుకున్న వ్యక్తి ఏప్రిల్‌ 20న 420 దీక్ష చేశారన్నారు. నరేంద్రమోడీ, పవన్‌ కళ్యాణ్‌ను వెంట పెట్టుకొని, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో మళ్లీ అధికారంలోకి రావాలని భావించారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు విశేష స్పందన రావడంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని కేంద్రం తనకు సహకరించలేదని ప్లేట్‌ మార్చారన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమాలు పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నారు. పట్టిసీమ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చంద్రబాబుకు, ఉమాకు, లోకేష్‌కు మాత్రమే ముడుపుల కోసం పట్టిసీమను వాడుకున్నారన్నారు. దుర్మార్గడు చంద్రబాబు పాలనలో పేదరికం ఇంకా అట్టడుగుకు వెళ్తుందన్నారు. యార్లగడ్డ ప్రజా నాయకుడని, ఆయన్ను గెలపించాలన్నారు. 

తాజా వీడియోలు

Back to Top