బాబు తక్షణమే రాజీనామా చేయాలి

చిత్తూరు: రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని వైయస్సార్సీపీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనపై వైయస్సార్ సీపీ సంధించిన 100 ప్రశ్నలకు  జీరో మార్కులు వచ్చాయని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కృష్ణా పుష్కరాల పేరుతో 30 దేవాలయాలను కూల్చివేయించిన ఘనుడు చంద్రబాబు అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా పుష్కరాల పేరు చెప్పి చందాలు అడగడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని దుయ్యబట్టారు.


Back to Top