అవిశ్వాసం చర్చకు రానివ్వకుండా చంద్రబాబు డ్రామాలు

రాజకీయం వైయస్‌ జగన్ను చూసి నేర్చుకో..
బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ జతకట్టిందని టీడీపీ దుష్ప్రచారం
బలం లేక పార్టీలతో పొత్తు పెట్టుకునేది చంద్రబాబే
వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీకి దిగుతాం 
కేంద్రానికి సహకరిస్తూ వెల్‌లోకి వెళ్లి టీడీపీ ఎంపీల నిరసన


హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు రాజకీయం చేయడం నేర్చుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ జతకట్టిందని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ఎలాంటి పరిస్థితిల్లో జతకట్టబోమన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు బలం లేక బీజేపీ, పవన్‌కల్యాణ్‌తో కలిసి పోటీ చేశారని, వైయస్‌ఆర్‌ సీపీ సింగిల్‌గా పోటీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా సింగిల్‌గానే పోటీకి దిగుతామన్నారు. రాజకీయ స్వార్థం కోసం పార్టీలను వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట అని, విలువలు విశ్వసనీయత పాటిస్తూ రాజకీయాల్లో ఎదుగుతూ.. ప్రజల అభిమానం చురగొంటున్న వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. టీడీపీకి అసలు సిద్ధాంతాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. 

బండారం బయటపడుతుందనే కుట్ర

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే బీజేపీ, టీడీపీ బండారం బయటపడుతుందని మోకాలొడ్డారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని నీరుగార్చారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సహకరించకుండా టీడీపీ నేతలు వెల్‌లోకి వెళ్లి నిరసన ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందం మేరకు అవిశ్వాసం చర్చకు రానివ్వకుండా టీడీపీ కుట్రలు పన్నుతుందన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టింది కనుకే జాతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో జతకట్టి అన్ని విషయాలను సమర్థించడం అన్ని జాతీయ పార్టీలు చూశాయని, ఇలాంటి సమయంలో టీడీపీ అవిశ్వాసానికి ఎలా మద్దతు ఇస్తాయన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటాలను చూసి జాతీయ పార్టీలు సైతం మద్దతు ఇవ్వడానికి ముందకు వచ్చాయని రాష్ట్ర ప్రజానికానికి తెలుసన్నారు. 
Back to Top