బాబు మాట నిలబెట్టుకో-చాంద్ బాషా

హైదరాబాద్ః  ముఖ్యమంత్రి చంద్రబాబు గత జూన్ 14న కదిరికి వచ్చినప్పుడు రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఆ ఊసేలేకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా సభలో ప్రస్తావించారు. ఇంతవరకు ఎక్కడా ఆ దిశగా పనులు ప్రారంభం కాలేదు. ఎలాంటి సర్వేలు జరగలేదన్నారు.

19-3-2015న తాను ప్రశ్నిస్తే 135 కోట్లతో బైపాస్ ప్రతిపాదన చేసినట్లు సభలో చెప్పారని గుర్తు చేశారు. ఏడాది గడిచినా ఇంతవరకు ఎలాంటి కేటాయింపులు గానీ, బైపాస్ ప్రస్తావన గానీ జరగలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల కదిరి నుంచి బెంగళూరు వెళ్తున్న సిమెంట్ లారీ ప్రమాదానికి గురై 25 మంది చనిపోయారని..దాన్ని దృష్టిలో ఉంచుకొని  బైపాస్ రోడ్డు వేయాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top