బాబుకు దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

కృష్ణానది లాగే టీడీపీ కూడా ఎండిపోతుంది
గన్ మ్యాన్, డ్రైవర్ మాత్రమే జలీల్ ఖాన్ వెంట వెళ్లారు
జలీల్ ఖాన్ పోవడంతో నియోజకవర్గానికి..
పట్టిన దరిద్రం పోయింది
కార్యకర్తలంతా వైఎస్సార్సీపీతోనే ఉన్నారు
పశ్చిమనియోజకవర్గ కార్యకర్తలతో నేతల సమావేశం

విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్  మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుందని ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, కె.పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఈసందర్భంగా పెద్ది రెడ్డి మాట్లాడుతూ  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై  మండిపడ్డారు. అభివృద్ది చూసి వెళ్లామంటూ కళ్లబొర్లు కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ప్రాజెక్టులతో వస్తున్న కమీషన్లతో చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

ఈసందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ...  చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి... మళ్లీ ఎన్నికల్లో గెలివాలి అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ఖాన్పై మండిపడ్డారు. జలీల్ఖాన్ పార్టీ మారడం వల్ల పశ్చిమ నియోజకర్గానికి ఉన్న దరిద్రం పోయిందని అన్నారు. 

అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ... కృష్ణానదిలో నీరు ఎలా ఎండిపోతుందో... రేపు టీడీపీ కూడా అలాగే ఎండిపోతుందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలోకి జలీల్ఖాన్ వెళ్లారన్నారు. ఆయన పార్టీని వీడినా... కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. 
వంగవీటి రాధా మాట్లాడుతూ... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ గెలవాలని జలీల్ ఖాన్కి వంగవీటి రాధా సవాల్ విసిరారు. 

జలీల్ఖాన్ పార్టీ వీడి వెళ్లడం వల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ మంత్రి, కె.పార్థసారథి వ్యాఖ్యానించారు. గన్మాన్, డ్రైవర్, అతని పీఏ మాత్రమే జలీల్ఖాన్ వెంట వెళ్లారని... కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పార్థసారథి పేర్కొన్నారు. 

ఇదే వార్తాశం ఇంగ్లీష్
లో:   http://goo.gl/sygXpq 

తాజా ఫోటోలు

Back to Top