మొదట నోటీసులు ఇవ్వాల్సింది బాబుకే

తిరుపతి : తుని ఘటనలో తనపై చంద్రబాబు నాయుడు కుట్రతో వ్యవహరించారని  వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఈ ఘటనలో మొదట నోటీసులు ఇవ్వాల్సింది చంద్రబాబుకేనని అన్నారు.  తుని ఘటనపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే మాటకు తామిప్పటికీ కట్టుబడి ఉన్నామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని ఓటుకు కోట్లు కేసు భయంతోనే ప్రత్యేక హోదాను బాబు గాలికొదిలేశారని విమర్శించారు. బుధవారం అర్థరాత్రి వరకూ అనవసరమైన డ్రామాలు నడిపించారని భూమన మండిపడ్డారు.  ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి వైయస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.
Back to Top