నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి

బిసిలను అవమానించడం బాబుకు అలవాటుగా
మారింది.

మొన్న మత్సకారులను కులపెద్దలను కూడా
ఇదే విధంగా అవమానించారు

బిసి న్యాయవాదులను జడ్జిలు కాకుండా
అడ్డుకున్నారు

బిసిల ఓట్లతో అదికారంలోకి వచ్చిన
చంద్రబాబుకు ఇది తగదు

వైెయస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ బిసి
సెల్  రాష్ట్ర  అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి డిమాండ్

విజయవాడః తమ న్యాయమైన డిమాండ్లతోపాటు
కనీస వేతనాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు ఘోరంగా అవమానించారని వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్
పార్టీ బిసి సెల్  రాష్ట్ర  అద్యక్షుడు  జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. విజయవాడలోని
రాష్ర్ట పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ
నాయీ బ్రాహ్మణులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న వారిని సెక్రటేరియట్ లో చర్చలకు
పిలిచి, ఈ సందర్భంగా   కలసిన నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులతో  ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు బిసిలను అవమానించే
విధంగా ఉందన్నారు.

 తమాషా చేస్తున్నారా ..మీ తోకలు కత్తిరిస్తా
అని ...వేలు చూపించి నాయీ బ్రాహ్మణనేతలను బెదిరించే దోరణిలో ముఖ్యమంత్రి
స్దాయివ్యక్తి మాట్లాడటం దారుణం అని వ్యాఖ్యానించారు. రెక్కాడితే గాని డొక్కాడని
పరిస్ధితిలో ఉన్న క్షురకులు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనాలు అడగడమే
నేరంగా చంద్రబాబు వ్యవహరించడం అన్యాయమని అన్నారు.

వాస్తవంలో తెలుగుదేశం పార్టీకి చెందిన
కనకదుర్గమ్మ ఆలయం పాలకవర్గసభ్యుడు పెంచలయ్య నాయీబ్రాహ్మణులపై చేయిచేసుకోవడం వల్ల
ఉద్యమం ప్రారంభమైందని,చంద్రబాబు నాయుడు దాదాపు నాయీ బ్రాహ్మణులపైపైకి
వెళ్లి బెదిరించడం ఆయనకు బిసిల పట్ల ఉన్న చులకనభావాన్ని తెలియచేస్తోందని అన్నారు. దాదాపు
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో వందల ఏళ్ల నుంచి నాయీ బ్రాహ్మణులు కేశఖండన ద్వారా
సేవలందిస్తున్నారని,తద్వారా వచ్చే ఆదాయం  వారి కుటుంబాలు పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని
అందువల్ల తమను ఆదుకోవాలని వారు అర్దిస్తున్నారని  జంగా కృష్ణమూర్తి తెలిపారు. అలాంటి వారిపట్ల
మానవతా హృదయంతో స్పందించి చట్టబద్దంగా చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వారిపై
ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా మిమ్మల్ని ఉద్యోగులుగా తీసుకోమని చెప్పడం దారుణం అని
అన్నారు. ఒక్క విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలోనే సంవత్సరానికి ఏడుకోట్ల రూపాయల
ఆదాయం తలనీలాల ద్వారా వస్తోందని వివరించారు.దానిలో నుంచి వారికి కనీసవేతనాలు అమలు
చేయడం పెద్ద కష్టం కాదని కూడా జంగా వివరించారు.ఇప్పటికైనా బిసిల పట్ల ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు వివక్ష విడనాడి నాయీబ్రాహ్మణుల సమస్యలను సానుకూలంగా
పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

Back to Top