జననేత దీక్షతో బాబుకు మైండ్‌ బ్లాక్‌

బాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు
ఓటుకు నోటు భయంతో నోరుమెదపడం లేదు
రాష్ట్రానికి నిధులు రాబట్టలేని అసమర్థ ప్రభుత్వం
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన రోజా

వైయస్సార్ జిల్లా(రాజంపేట): ఈ నెల 16, 17, 18వ తేదీల్లో కర్నూలుల్లో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  చేపట్టిన జలదీక్షకు విశేషస్పందన లభించిందని ఎమ్మెల్యే ఆర్‌కెరోజా అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమాలు, దీక్షలతో చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే..సీఎం చంద్రబాబు కుటుంబంతో విహారయాత్రలు చేస్తున్నారని ఆమె ఫైరయ్యారు.  వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డితో కలిసి ఆయన స్వగృహంలో రోజా విలేకర్లతో మాట్లాడారు. 

అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. రాష్ట్ర విభజనతో జరిగే నష్టాలను ముందుగానే జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హెచ్చరించారన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందని చెప్పారు. విభజనచట్టంలోని హక్కులపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. కడప ఉక్కు, గాలేరు–నగిరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదన్నారు. షెడ్యూల్‌ –10లో 132 సింహభాగంలో రావాల్సిన వాటిపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చుకొని పరిష్కరించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీసే ధైర్యం సీఎంకు లేదన్నారు. తెలంగాణాలో అక్రమప్రాజెక్టులపై సీఎం నోరు మెదపలేదంటే తెలంగాణాలో ఓటుకు నోటు కేసు భయాలు వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు. 

ఢిల్లీపెద్దలను కలిసి నిధులను రాబట్టలేని దుస్ధితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని రోజా ఎద్దేవా చేశారు.  సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చొప్పాయల్లారెడ్డి, నేతలు భాస్కరరాజు, జీవీసుబ్బారెడ్డి, పాపినేనివిశ్వనాధరెడ్డి, సౌమిత్రి,కొప్పలసుబ్బన్న, గోవిందుబాలకష్ణ, పసుపులేటి సుధాకర్, మైనార్టీ నేతలు జావిద్‌అలీ, యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.
Back to Top