రోజాను చూసి చంద్రబాబు భయపడుతున్నారు

ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నారు
బాబు రోజాపై మీకెందుకంత కక్ష
మహిళలను కించపరుస్తున్నారు..సభను పక్కదారి పట్టిస్తున్నారు

హైదరాబాద్ః చంద్రబాబు రోజాను చూసి భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రోజా నిలదీసినందునే టార్గెట్ చేసి  సభనుంచి సస్పెండ్ చేశారని ఈశ్వరి మండిపడ్డారు. రాజధాని విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ బాగోతంపై రోజా వాయిదా తీర్మానం ఇస్తే...దాన్నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షంపై కుట్ర పన్నిందని ఫైరయ్యారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారికి సంబంధించిన వ్యక్తులు కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుపోయారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే రోజాకు అవకాశం ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. 

నూతన రాజధాని, బ్రాండ్ ఇమేజ్ అని చెప్పుకునే ప్రభుత్వం.... విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను ఏవిధమైన ఇబ్బందులకు గురిచేసిందో అందరం చూశామన్నారు.  అధిక వడ్డీలు చెల్లించలేక మహిళలు ఎంత క్షోభ అనుభవించారో..ఆఅంశం దేశవ్యాప్తంగా ఏవిధంగా కుదిపేసిందో తెలిసిందేనన్నారు. దానిపై  ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీసింది. రోజా ఆ అంశం మీద వాయిదా తీర్మానం ఇచ్చి మాట్లాడాలన్నప్పుడు..నిరసన తెలుపుతూ పోడియం వద్దకు వెళ్లాం. కానీ చంద్రబాబు రోజాను వ్యక్తిగత కక్షతో టార్గెట్ చేశారని ఈశ్వరి చెప్పారు.  

రోజా విపరీతమైన మనస్తత్వం గలదని టీడీపీ ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతున్నారు. రోజా  టీడీపీలో పనిచేసిన్పపుడు మీకు అలా ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు.  మహిళల సమస్యలపై పోరాడుతున్న తమ మహిళా అధ్యక్షురాలికి అండగా ఉండి న్యాయపోరాటం చేస్తామన్నారు. రోజాను నేరుగా ఎదుర్కోలేక టీడీపీ తన అనుకూల మీడియాలో ఓ రకమైన హావభావాలను చూపించడం దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలు మాట్లాడిన అసభ్యపదజాలం మీకు కనిపించడం లేదా అని నిలదీశారు.   ఏదైనా గొడవ వస్తుందంటే స్పందన ప్రతిస్పందన రెండూ ఉండాలని, ఒకరినే తప్పుబట్టడం దారుణమన్నారు. 

రోజాను టార్గెట్ చేసి  నిర్దాక్షిణంగా 340(2) కింద సస్పెండ్ చేశారు. కనీసం  ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకు సస్పెండ్ చేశారని స్పీకర్ ను అడగడానికి సభా ప్రాంగణానికి వస్తే... మార్షల్ చేత మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దారుణంగా అరెస్ట్ చేసి హింసించారు.  క్లాజ్ పరిమితి దాటి సస్పెండ్ చేశారని రోజా న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు డైరక్షన్ తో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా  ప్రభుత్వం పక్కనబెట్టి దారుణంగా ప్రవర్తిస్తోందని ఈశ్వరి విరుచుకుపడ్డారు. 

ప్రజల సమస్యలపై మాట్లాడుదామని తొలిసారిగా సభకు వచ్చిన తమకు అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసి విస్తుపోయామన్నారు. ప్రజలు ఐదేళ్లు అధికారమిచ్చారు. ఏమైనా చేస్తామన్న రీతిలో సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు.  చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల, ఉమ, కామినేని సహా టీడీపీ నేతలు  మాట్లాడిన మాటలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా, మహిళలుగా, గిరిజనులుగా తలదించుకొని బాధపడ్డామన్నారు. వీరిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తే దానిని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదన్నారు. 

ఏం  తమాషానా, మీ అంతు చూస్తాం, కొత్త ఎమ్మెల్యేలు అంటూ బాబును తమను తిడుతుంటే ఎంతో ఆవేదన చెందామని ఈశ్వరి అన్నారు. తాను సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మహిళా సాధికారిత గురించి మాట్లాడుతుంటే..సంబంధం లేకున్నా కూడా అనిత లేచి దారుణంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు తలనరికే ఆమె కూడా మాట్లాడుతుందా అంటూ అహంకారం ప్రదర్శించిందన్నారు. టీడీపీలో అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నా...బాబు దళిత ఎమ్మెల్యే అనితతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడించారన్నారు.  రోజా సభకే రాకూడదని అనిత మాట్లాడుతోందని..అలా చెప్పడానికి ఆమె ఎవరని మండిపడ్డారు.   రోజా చంద్రబాబు కాలిగోటికి కూడా సరిపోదంటూ మంత్రి పీతల సుజాత మాట్లాడిన మాటలు దారుణమన్నారు. 

చంద్రబాబు మహిళలను కించపరుస్తూ  సభను పక్కదారి పట్టిస్తున్నారని ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధ్యక్షులు వైఎస్ జగన్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే.... టీడీపీ నుంచి  పదిమంది వరకు లేచి ఉచ్చరించలేని రీతిలో నోటికివచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 
కొవ్వెక్కిందా, మగతనం ఉందా, మగాడివా, ఆర్థిక ఉగ్రవాది, దొంగ అంటూ సభ్యసమాజం తలదించుకునే రీతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. 

Back to Top