బాబుపాల‌న రాజ్యాంగ ఉల్లంఘ‌న‌

శ్రీకాకుళం) చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంద‌ని మాజీమంత్రి , వైయ‌స్సార్సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు వెల్ల‌డించారు. శ్రీకాకుళంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  బాబు పరిపాలన గడచిన రెండేళ్లుగా చూస్తే రాజ్యాంగాన్ని ఉల్లంగించడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తుండడం, చట్టాలను అతిక్రమించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అతిక్రమించమని చెబుతూ ఉండడం, ఇలాంటివి రానురాను మరీ ఎక్కువైపోతున్నాయన్నారు. కొన్ని చాన ల్, పత్రికను నిర్బంధించడం వల్ల తనకు అనుకూలమైన వార్తలను రాయించడం, ప్రజలకు వాస్తవాలు తెలియజేయకుండా పౌరులను అయోమయానికి గురిచేసే స్థితిలో నడపడానికి ప్రయత్నిస్తోందన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై పెట్టిన ఆంక్షలు ఒకసారి చూస్తే చంద్రబాబు గతంలో చెప్పిన మాటలు, నీతులు తనవరకు వచ్చినపుడు పాటించడం లేదన్నది  అనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా అని, ప్రజల తరఫున వాస్తవాలను ప్రపంచానికి చూపించడానికి మీడియా గొప్ప ఆయుధమని, మీడియాను బ్యాన్ చేయడానికి ప్రభుత్వాలు దిగజారితే ప్రజాస్వామ్యంపై పూర్తిగా పరిపూర్ణత సమకూరదని అభిప్రాయపడ్డారు. 

 ప్రపంచంలో ఎక్కడ చూసినా, మనదేశంతోపాటు ఇతర దేశాలలో కూడా చూస్తే ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి పత్రికలను, చానల్‌ను అదుపు చేసిన ప్రభుత్వాలు, నాయకులుగానీ ఎక్కడా సర్వైవ్ కాలేదన్న విషయూన్ని చరిత్ర చెబుతుందన్నారు. జిల్లాలో ఉండే అధికారులు, చానల్ నిర్వహిస్తున్న ఎంఎస్‌వోలు అడ్డగోలుగా ఇలాంటి నిర్ణయాలు, నిబంధనలు పాటించడం సరికాదన్నారు.
 
  ఒకసారి నిబంధనలు, చట్టాలకు విరుద్ధగా పనిచేయడం ప్రారంభిస్తే ఎవరు అధికారంలోకి వస్తే వారు దీనిని వాడుకుని పౌరులకు, వ్యవస్థకు మోసం చేసే స్థితికి దారితీస్తాయన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారంతా దీనిని తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. వెంటనే దీనిని మానుకోవాలని అధికారంలో ఉన్నాం గనుక ఇట్లాంటి రాజకీయ విరుద్ధమెన పనులు చేయకూడదని  కోరుతున్నామని వివరించారు. తదుపరి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి పోరాటం చేస్తామని  ధర్మాన వెల్లడించారు. 
Back to Top