చంద్రబాబు పాలన మొత్తం మోసాలే: వైఎస్ జగన్

గుంటూరు) ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పాలన అంతా మోసాలతోనే గడుస్తోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. కరువు, తాగునీటి ఎద్దడితో ప్రజలు బాధపడుతుంటే
ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ప్రజల గొంతు వినిపించకుండా ఉండేందుకు ప్రతిపక్ష
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం మీదనే ద్రష్టి పెడుతున్నారని అభిప్రాయ పడ్డారు.
గుంటూరు జిల్లా మాచర్ల లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి తో కలిసి ఆయన
ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెల్లువలా
తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగ భరితంగా
ప్రసంగించారు. చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ఒక్కొక్కటిగా విడమరిచి చెబుతుంటే అశేష
స్పందన కనిపించింది. ఈ పోరాటం ఆగదని, మరింత ఉధ్రతంగా సాగుతుందని వైఎస్ జగన్
అన్నారు.

 

Back to Top