బాబు పాలన అంతా భ్రాంతే..!

హైదరాబాద్) పట్టిసీమ కట్టేది రాయలసీమకేనన్న భ్రాంతిని కల్పిస్తూ చంద్రబాబు
కాలక్షేపం చేస్తున్నారని వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో
మాట్లాడారు.  సీమ ప్రాంతినకి వచ్చే నీళ్లు తమకు
ఇస్తే చాలని ఆయన అన్నారు. పట్టిసీమ వద్దు, మరో సీమ వద్దు అని ఆయన వ్యాఖ్యానించారు.
 అలా ఇవ్వాలంటే శ్రీశైలం లో 854 అడుగులు మెయింటైన్ చేయాలని, అప్పుడే తమకు న్యాయం
జరుగుతుందని పేర్కొన్నారు. ఆరు జిల్లాలను పూర్తిగా అన్యాయం చేశారని శ్రీకాంత్
రెడ్డి అభిప్రాయ పడ్డారు.

 

Back to Top