అవినీతికి కర్త,కర్మ అన్నీ బాబే

హైదరాబాద్ః ఏపీలో దౌర్భాగ్యమైన పాలన కొనసాగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త, కర్మ అన్నీ చంద్రబాబేనని పద్మ దుయ్యబట్టారు. ఏ పార్టీ నాయ‌కుడైనా ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు పాటుప‌డతారని... కానీ చంద్ర‌బాబు మాత్రం దానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నార‌ని ప‌ద్మ అన్నారు. రాష్ట్రంలో అయ్యప్ప దీక్షల వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయనేవిధంగా బాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. కిందిస్థాయి ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చే వాటిపై  సంత‌కం పెట్ట‌డం లేదని.. కేవ‌లం సిఫార్పులు, లాబియింగ్‌ల ద్వారా వ‌చ్చే ఫైల్స్‌పైన మాత్ర‌మే సంత‌కాలు పెడుతున్నానంటూ స్వ‌యంగా బాబే చెప్ప‌డం బ‌ట్టి ఆయ‌న పాల‌న ఏవిధంగా ఉందో అర్థ‌మ‌వుతుంద‌న్నారు.

Back to Top