రాయలసీమపై చంద్రబాబుది కపటప్రేమ

వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమపై కపట ప్రేమ చూపిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్‌కు సాగునీరు సరఫరా చేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వని కారణంగా ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్‌ వద్ద రైతులతో వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కేసీ కెనాల్‌ నుంచి కడప కలెక్టరేట్‌ వరకు రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ నిరంకుశ పోకడకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు పార్టీలకు అతీతంగా రైతులందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
Back to Top