చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదు

() చంద్రబాబు కుటుంబ సభ్యులకు మానసికస్థితి
సరిగ్గా ఉండదు

() ప్రాజెక్టుల అక్రమాలపై బహిరంగ చర్చకు వస్తారా

() టీడీపీ నేతల తీరుమీద అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపాటు

 విజయవాడః చంద్రబాబు ప్రజలను నయవంచన చేసి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ఏం సాధించారని నవనిర్మాణ
దీక్షలు చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క
వాగ్ధానాన్ని నెరవేర్చకుండా.... రైతులు, మహిళలు, నిరుద్యోగులు అలా అన్ని వర్గాల ప్రజలను
చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రమేష్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ, సోదరుడు, మంత్రుల మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, వై వైద్యం చేయించాలని ఎద్దేవా చేశారు. జోగి రమేష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

బాబు వన్నీ మోసాలు

రైతులు,
డ్వాక్రా
అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన రుణమాపీపై మాట తప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు
చెప్పారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం
చేశారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజల
పక్షాన ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తుంటే విమర్శలు చేస్తారా..?  చంద్రబాబు , మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమల మానసిక పరిస్థితి సరిగ్గా
లేనందునే...ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్న వైయస్ జగన్ ను ఆడిపోసుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలబడడం తప్పా...? మేనిఫెస్టోలో మీరు పెట్టిన వాగ్ధానాలను
నెరవేర్చాలని ప్రశ్నించడం తప్పా ..?

 బాబు పరిస్థితి బాగోలేదు

బాబు,
మంత్రుల మానసిక
పరిస్థితి బాగోలేదు గనుకే అసెంబ్లీలో సైకోల్లా వ్యవహరించారని, దీన్ని ప్రజలంతా చూశారు. నరేంద్రమోడీ రాజధాని
శంకుస్థాపన కార్యక్రమానికి వస్తే ....రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడగకపోగా, మర్చిపోయి ప్యాకేజీ అడిగానంటూ చంద్రబాబు బుకాయించారు.
 బాబుకు మతిమరుపు వచ్చిందని, ఓ గంటలో చెప్పింది మరో గంటలో మర్చిపోతున్నారని ఆయన సొంత పార్టీ నేతలే
చెబుతున్నారు.

 ప్రమాణస్వీకారం రోజు మీరు పెట్టిన  ఐదు సంతకాల్లో ఒక్కదాన్నైనా
నెరవేర్చారా బాబు...?
పక్కా ఇళ్లు
కట్టిస్తామన్నారు.  బీసీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. కాపులకు రిజర్వేషన్
కల్పిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు. ఇవన్నీ ఏమయ్యాయి బాబు.
 ఇచ్చిన హామీలకు దిక్కులేదు గానీ...నవనిర్మాణ దీక్షలా..? సిగ్గుగా లేదా బాబు..?  రెండేళ్లుగా పాడిందే పాడరా పాసుపల్లా దాసరి
అంటూ బాబు చెప్పిందే చెబుతుంటేప్రజలు విసిగిపోయారు.

చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం                            

సంతలో పశువుల మాదిరి ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతూ..చరిత్ర గలిగిన
విజయవాడలో చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. చెప్పిందే చెప్పి ప్రజలను
వంచించే కార్యక్రమం చేస్తున్నారు. రెండేళ్లలో బాబు చేసింది శూన్యం. ప్రత్యేకహోదా, రైల్వే జోన్,  రాష్ట్రానికి రావాల్సిన నిధులను పాతరేసి...కేంద్రానికి
తాకట్టు పెట్టాడు.  కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మారే పరిస్థితి తీసుకొచ్చారు.
ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన
చంద్రబాబు...రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారు.

పడకేసిన సాగునీటి శాఖ

తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లు కడుతుంటే బాబును ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు.
మీ తప్పులను
వీరుడిగా,
ధీరుడిగా  వైయస్ జగన్
ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడు. వైయస్ జగన్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అక్రమ ప్రాజెక్టుల విషయం లేవనెత్తకపోతే చర్చ
జరిగేదా,
ప్రభుత్వం
స్పందించేదా.  వైయస్ జగన్ దీక్ష చేసేదాకా  బాబు, దేవినేని నిద్రపోయారు. ఆతర్వాత ఏవో మాట్లాడడం మొదలుపెట్టారు.  కృష్ణా
ఎడారిగా మారిపోయింది. మిమ్మల్ని చెప్పులతో కొట్టరా ప్రజలు. ప్రజలకు తాగునీరు కూడా
ఇవ్వని దద్దమ్మ దేవినేని ఉమ. రాయలసీమకు నీళ్లిస్తాడట. వైయస్ జగన్ అనే వీరుడు లేకపోతే
రాష్ట్రంలో ప్రశ్నించే నాథుడే కరువయిపోతాడు. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. దమ్ము, దైర్యం ఉంటే రెండేళ్లలో మీరేం చెప్పారు, ఏం చేశారో చర్చ పెట్టండి. సిగ్గులేని
మంత్రులను,
ముఖ్యమంత్రిని
అడుగుతున్నాం.

మీ నాయకులే చెబుతున్నారు

వైయస్ జగన్ ను విమర్శించడం కాదు చెప్పిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు ముందుకు
వెళ్లాలి. రైతుల పొట్ట గొట్టారు. రైతుల భూములు లాక్కొని వేలాది కోట్ల కుంభకోణం చేశారు. దీన్ని మీ
పార్టీ నాయకులే వేలెత్తి చూపించారు. కర్నూలులో మీ నైజం గురించి అక్కడ నాయకులే
చెప్పారు. వందకోట్లకు రాజ్యసభ సీటు అమ్ముకున్నారన్నారు. బీసీల ఓట్లతో గెలిచామని చెప్పే టీడీపీని
కూకటివేళ్లతో పీకేస్తామన్నారు. నీతులు చెబుతాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా
ఉంది. రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్న దాన్ని మీ పార్టీ నేతలే చెబుతున్నారు.  వైయస్ జగన్
ప్రజల మనిషి. తప్పులను ఎత్తిచూపడంలో ముందుంటారు. ఆయన కంఠం నుంచి ప్రజావాణి
వినిపిస్తోంది. బాబు మానసిక పరిస్థితి , మంత్రుల మానసిక పరిస్థితి గురించి అందరికీ
తెలుసు. 

అని జోగి
రమేష్ మండిపడ్డారు.

 

Back to Top