డ‌బ్బుతో రాజ‌కీయాల‌ను వ్యాపారంగా మారుస్తున్న చంద్ర‌బాబు

మంగ‌ళ‌గిరి: అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్నార‌ని మాజీమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. స్థానిక శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకున్న అనంతరం పార్టీ నాయకులు కామిశెట్టి శివనాగేశ్వరావును మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. డ‌బ్బుల‌తో ఓట‌ర్ల‌ను కొనుగోలు చేసిన చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశార‌ని మండిప‌డ్డారు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చునని బాబు తీసుకుంటున్న‌ నిర్ణయాలు సమాజానికి గొడ్డలి పెట్టుగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ధనప్రభావం, ప్రవాహం ఎక్కువై నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు పరాకాష్టగా మారిందన్నారు. ఇటీవల అధికారులపైనా, అవినీతి అక్రమాలు వెలికితీసే విలేకరులపైన దాడులకు టీడీపీ నాయకులు దిగడం దారుణ‌మ‌ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయ‌న వెంట పార్టీ జిల్లా బీసీ కన్వీనర్‌ నాగినేని శేషగిరిరావు, కోసూరు నాగమల్లేశ్వరావు, యాసం చిట్టిబాబు, కోసూరు శివాజీ, కోసూరు గోఫీచంద్‌లు పాల్గొన్నారు.

Back to Top