ప్ర‌త్యేక హోదాను క‌ట్ట‌డి చేసేందుకు బాబు కుట్ర‌

హైద‌రాబాద్‌: రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరుకుంటుంటే చంద్ర‌బాబు మాత్రం ప్ర‌త్యేక హోదాకు అడ్డు ప‌డుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని సాధించుకునేందుకు తాము ధ‌ర్నాలు..దీక్ష‌లు.. నిర‌స‌న‌లు చేశామ‌ని, కానీ బాబు మాత్రం ప్ర‌త్యేక హోదాను అడ‌గ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని బాబుకు తెలిసినా త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం ప్ర‌త్యేక‌ ప్యాకేజీల‌ను అడుగుతున్నార‌న్నారు. క‌మీష‌న్ల కోసం బాబు నీచ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Back to Top