ఐదురోజుల వెనక మర్మమేంటి బాబు..!

సోమవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఐతే, ప్రభుత్వం సమావేశాలు ఐదు రోజులు మాత్రమే నిర్వహిస్తుండడం వెనక పెద్ద కుట్రే ఉంది.ప్రతిపక్షానికి జడిసే అధికార పార్టీ ఈనిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సమాయత్తమవుతుండగా...వాటి నుండి తప్పించుకునేందుకే బాబు  సమావేశాలను కుదించారు. 

సమావేశాలు ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఉండడంతో బాబు ఈఎత్తుగడ వేశారు. ఐదు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలని మ్యామ్యా అనిపించి గండం నుంచి గట్టెక్కాలన్న ప్రయత్నాల్లో  బాబు ఉన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజల హామీలు నెరవేర్చకపోగా...ఇంకా మాయమాటలతో బాబు ప్రజలను మోసపుచ్చుతూ వస్తున్నారు. రాష్ట్రాన్ని  సంక్షోభంలోకి  నెట్టి భ్రష్టుపట్టించారు.
 
అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేక విధానాలతో పీకల్లోతు కూరుకుపోయిన  పచ్చపార్టీకి  ఇప్పుడు జగన్ ఫియర్ పట్టుకుంది. 
అసెంబ్లీ సమావేశాలంటేనే బాబు అండ్ కో టెన్షన్ పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలో తెలియక జుట్టుపీక్కుంటోంది. అధికార పార్టీ అరచకాలను అసెంబ్లీ వేదికగా కడిగిపారేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సిద్ధమవ్వడంతో పచ్చనేతలు అంతర్మథనంలో పడిపోయారు. 
Back to Top