బాబు నీచ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌

పాలకొల్లు టౌన్‌: పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడం చంద్ర‌బాబు నీచ రాజకీయాలకు పరాకాష్ట అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన నీచరాజకీయం వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నమ్మకం పోయే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో గెలిపించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top