అవినీతి పీఠాధిపతి చంద్రబాబు

 
– రూ.2 లతో చంద్రబాబు దొంగతనాలు ప్రారంభం
– అనుకూల మీడియాను మేనేజ్‌ చేసినా సోషల్‌ మీడియాలో పప్పులుకడవ్‌
– చంద్రబాబు రాజకీయ జీవితంలో చీకటి అధ్యాయం తెరవాల్సిన సమయం వచ్చింది
– విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకడు భూమన కరుణాకర్‌రెడ్డి 


హైదరాబాద్:  రాష్ట్రంలోని అవినీతి పీఠానికి చంద్రబాబు పీఠాధిపతి అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఏం మాట్లాడినా చూపించడానికి అనుకూల మీడియా ఉంది కదా అని.. చంద్రబాబు తనను తాను వివేకానందుడిలా ఊహించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భూమన మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితంలోని కొన్ని కీలక సంఘటనలను ప్రస్తావించారు.  చేతికి వాచీ,వేలుకి ఉంగరం లేదని.. నిజాయతీ పరుడిగా అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే ప్రచారాన్ని జనం నమ్మే ప్రసక్తేలేదని అన్నారు. టీవీ ముందుకొచ్చి ఎన్ని సూక్తులు చెప్పినా.. సోషల్‌ మీడియా పుణ్యమా అని అసలు నిజాలు క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతున్నాయని.. చంద్రబాబు నీచపు రాజకీయాలకు కాలం చెల్లిందని హెచ్చరించారు. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని లక్షా 20వేల కోట్లు అప్పుల్లో ముంచిన ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. 

చంద్రబాబు జీవితంలో తెరవని పేజీలు

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తెరవని పేజీలను ప్రజల ముందు ఉంచాల్సిన సమయం వచ్చిందని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చుకానీ.. ఆయన్ను మొదట్నుంచీ ఎరిగిన తనకు ఆయన జీవిత చరిత్ర పూర్తిగా తెలుసన్నారు. చంద్రబాబు జీవితంలోని చీకటి కోణాలను  ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బాబు అవినీతి చరిత్ర రెండు రూపాయల దొంగతనంతో ప్రారంభమైందని.. దానికి సంబంధించిన సంఘటనను వివరించారు. 

– వెంకటేశ్వర యూనివర్సిటీలో రాడికల్స్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌లో తానొక వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నానని భూమన వివరించారు. 1974లో ఫండ్‌ రైజింగ్‌ కోసం ఏఎన్‌ఆర్‌ నటించిన ‘చక్రపాణి’ అనే సినిమాను బెనిఫిట్‌ షోగా వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దానికి టిక్కెట్‌ ధర రూ.2 లుగా నిర్ణయించి తాను ఇతర మిత్రులు ఎన్‌. శ్రీధర్‌(ఇప్పుడు లేరు), శివారెడ్డి(హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌)లతో కలిసి టిక్కెట్‌ అమ్మేందుకు ఏబ్లాక్‌లో ఉన్న చంద్రబాబు రూమ్‌కు వెళ్లామని చెప్పారు. ఆ సమయంలో తన జేబులో ఉన్న రెండు రూపాయలు ఇవ్వకుండా నిద్రపోతున్న తన స్నేహితుడి ప్యాంటు జేబు నుంచి రూ.2లు దొంగలించి స్వయంగా తన చేతికే ఇచ్చాడని తెలిపారు. చంద్రబాబు దొంగతనం అక్కడి నుంచే ప్రారంభమైందని తెలిపారు. 

– బాబు తాను పదో తరగతిలో ఉండగా ఓ నాటకంలో హీరో పాత్ర పోషించినట్టుగా ఇటీవల కొన్ని పత్రికల్లో చదివానని చెప్పారు. అయితే ఆ హీరో పాత్ర కోసం చంద్రబాబు చేసిన దొంగతనాన్ని భూమన బయటపెట్టారు. అయ్యవారు చంద్రబాబుకు మొదట కమెడియన్‌ పాత్రకు ఎంపిక చేస్తే.. వేరుశెనక్కాయల మూటను లంచంగా ఇచ్చి హీరో పాత్ర దక్కించుకున్నాడని తెలిపారు. ఆ వేరుశెనక్కాయలు కూడా చంద్రబాబు వారి పక్కింటోళ్ల పొలంలో దొంగతనం చేసి తెచ్చి ఇచ్చిన సంగతిని ఆ రోజు హీరో పాత్రను కోల్పోయిన చంద్రబాబు స్నేహితుడే తనతో స్వయంగా చెప్పాడని వెల్లడించారు. 
– 1977లో చంద్రబాబు యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నప్పుడు పెట్రోల్‌ అమ్ముకున్న ఉదంతాన్ని బయటపెట్టారు. 1977లో చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గల్లా జయదేవ్‌ తాత రాజగోపాల్‌నాయుడు బరిలో దిగారని... వీరరాఘవులు నాయుడు పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్నారన్నారు. వీరరాఘవులు నాయుడు ప్రచారం కోసం చంద్రబాబుకు ఒక జీపు, 200 లీటర్ల పెట్రోల్‌ బ్యారల్‌ అప్పగిస్తే.. తెల్లారి పొద్దునే పెట్రోల్‌ అయిపోందని ఆయన వద్దకు వెళ్లారని తెలిపారు. దానిపై ఆరాతీస్తే వీరరాఘవులు నాయుడికే చెందిన పెట్రోల్‌ బంకులోనే ఆ పెట్రోల్‌ అమ్మినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని 1977లోనే వీరరాఘువుల నాయుడు స్వయంగా తనతో చెప్పినట్టు భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. 
– ప్రస్తుతం ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న టీడీపీ నాయకుడి పెళ్లి సమయంలో చదివింపుల కింద స్నేహితుడి ఉంగరాన్ని ఊడ పెరికి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది ఆయన్ను అడిగినా తెలుస్తుందన్నారు. 
చంద్రబాబు నాయుడు పదవి కోసం ఎంతకైనా తెగించే రకమని.. ఆయనకు బంధుత్వాలు, రక్త సంబంధాలతో పనిలేదన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర అందరికీ తెలిసిందే అన్నారు. దాంతోపాటు మరో కీలక సంఘటనను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 
– 2004లో అలిపిరిలో చంద్రబాబుపై బాంబు దాడి అనంతరం తిరుమల పద్మావతి గెస్ట్‌ హౌస్‌లో ఉన్న చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లిన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడినే అమ్మనాబూతులు తిట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఒక తల్లికే పుట్టామన్న కనీసం ఇంగితం మరిచి సొంత తమ్ముడిని తిట్టిన విషయాన్ని.. రామ్మూర్తి నాయుడే స్వయంగా తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే క్షణాల్లో మాట మార్చి తమ్ముడే తనను దుర్భాషలాడినట్టు తల్లి అమ్మనమ్మకు చంద్రబాబు చెప్పాడని రామ్మూర్తి నాయుడు తనకు చెప్పుకుని వాపోయాడని తెలిపారు. 
వ్యవస్థల్ని మేనేజ్‌ చేసుకున్నంత మాత్రాన నిజాలు మాత్రం మారిపోవని భూమన పేర్కొన్నారు. 
Back to Top