బాబు పాలనలో శ్రమ దోపిడీ జరుగుతుంది

ఆవేదన వ్యక్తం చేసిన 108, 104 ఉద్యోగులు
విశాఖపట్నం: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రమ దోపిడీ జరుగుతుందని, 12 గంటలు ఉద్యోగం చేస్తున్నా పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని 108, 104 ఉద్యోగులు మండిపడ్డారు. చంద్రబాబు పథకాలు పేర్లు మార్చాడు కానీ, మా బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో 108, 104 ఉద్యోగులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వారి సమస్యలపై వినతిపత్రం అందించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. వాహనాల్లో కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోగులకు ప్రథమ చికిత్స చేయడానికి కూడా మందులు రావడం లేదన్నారు. 12 గంటలు ఉద్యోగం చేస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదన్నారు. కనీసం మండలానికి ఒక బండి అయినా మంజూరు చేయాలన్నారు. రూ. 4 వేల జీతం పెంచుతామని చంద్రబాబు చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అతీగతి లేదన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. 
Back to Top