బాబుపై 420 కేసు నమోదు చేయాలి

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైయ స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పినందుకు సీఎంపై 420 కేసు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో విద్యార్థి విభాగం నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా విజయవాడ పోలీస్‌ స్టేషన్‌ లో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రS అధ్యక్షుడు సలంబాబు, విజయవాడ నగర విద్యార్థి విభాగ అధ్యక్షుడు అంజి రెడ్డి, తదితరులు బాబుపై 420 కేసు పెట్టారు.  ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ..2014 ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీ నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చిందన్నారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి ఇప్పటికి  మూడేళ్లు గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. ఏ ఒక్క నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ధ్వజమెత్తారు.  ఎన్నికల ముందు చంద్రబాబు తమ మ్యానిఫెస్టో నిపుణుల పర్యవేక్షణలో రూపొందించామని చెప్పారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను అన్ని హామీలు నెరవేరుస్తామన్న సీఎం మూడేళ్లు కావొస్తున్నా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు రూ.70 వేలు బకాయి పడ్డారని, నిరుద్యోగి భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని సలాంబాబు హెచ్చరించారు.Back to Top