శృతిమించిన బాబు ప్రచార ఆర్భాటం

  • రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి పబ్లిసిటీ హంట్
  • పుష్కరాల పేరుతో రూ.3500 కోట్లు దోపిడీ
  • నీరాగారుతున్న ఓటుకు నోటు కేసు
  • భూకుంభకోణం వెనుక ఎంతమంది నయీంలున్నారో
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ః కృష్ణా, గోదావరి పుష్కరాల పేరిట చంద్రబాబు దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం శృతిమించిపోయిందని మండిపడ్డారు. 12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాలను కూడా నేనే చేస్తున్నాను, బ్రహ్మాండంగా జరిగాయని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే దానికి గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... 
()పుష్కరాలు నీవు తెచ్చేది ఏమిటి బాబు. ప్రతీ 12 సంవత్సరాలకోసారి వాటంతటగా అవే వస్తాయి. సంప్రదాయంగా పవిత్రస్నానాలు ఆచరిస్తాం.  పుష్కరాలు నావల్లే వచ్చాయి. నీనే పంపిస్తున్నానని బాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. బాబు పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరింది. 
() పేదలు సమస్యలతో అలమటిస్తున్నారు. సీమలో రైతులు కరువుతో అల్లాడిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంటలు వేశారు. రూపాయి వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లగురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడు.
()గోదావరి, కృష్ణా పుష్కరాల పేరిట మొత్తం  రూ.3500 కోట్లు దోచుకున్నారు. పుష్కరాల కోసం 10శాతం నిధులను ఖర్చు చేస్తే.. 90శాతం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. పుష్కరాలను భక్తితో నిర్వహించాలని తాము కోరుతున్నాం, కానీ సినీఫక్కీలో నిర్వహిస్తూ బాబు పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. 
()కృష్ణానది పుట్టింది మహారాష్ట్రలో వాళ్లు ఏం హడావిడి చేస్తున్నారు. ఎవరికోసం బాబు ఈనాటకాలు. ఎందుకు ఈ హంగామా.
()టీడీపీ పాలనలో  రైతులకు భరోసా లేదు. నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇలా ప్రతీ ఒక్కరూ అవస్థలు పడుతున్నా బాబుకు పట్టడం లేదు.  పంటలు ఎండిపోయిన రైతాంగం గురించి ఆలోచన చేయండి. ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాటి గురించి ఆలోచించాలి. 
() సినిమా డైరెక్టర్లను పెట్టుకొని పుష్కరాల పేరిట నీవు చేస్తున్న హడావిడి దేనికోసం బాబు.  పవిత్ర దేవాలయాలను కూల్చేశావు. సదావర్తి భూములను దోచుకున్నారు. దానిపై విచారణ జరపించాలి. 
()అంతా బాగుందని మాట్లాడుతున్న  అధికార టీడీపీ సభ్యులు పల్లెల్లోకి వచ్చి మాట్లాడాలి. ప్రజలు ఎలా ఉన్నారో తెలుస్తుంది. సింధు ఒలింపిక్ పతకం సాధిస్తే అది కూడా నావల్లే వచ్చిందని బాబు గొప్పలు చెప్పుకోవడం దారుణం. చేయని పనికి చేశానని చెప్పుకునే విధానం బాబు మానుకోవాలి. 
()మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏనాడు బాబులాగా చేశానని చెప్పుకోలేదు. ప్రజలకు అద్భుతమైన పాలన అందించి వారి గుండెల్లో కొలువై ఉన్నారు. 
()ఓటుకు నోటు కేసులో బ్రహ్మదేవుడు వచ్చినా చంద్రబాబు తప్పించుకోలేడని కేసీఆర్...నన్ను ముట్టుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుదంటూ చంద్రబాబు మాట్లాడారు. 
()ఓటుకు నోటు కేసులో బాబుపై 24 సార్లు ఛార్జిషీట్లు మెన్షన్ చేసినా కేసీఆర్ ఎందుకు విచారణకు పిలవడం లేదు. రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన ఓటుకు నోటు కేసును ఎందుకు నీరుగారుస్తున్నారు
()బాబును ఎందుకు విచారణకు పిలవడం లేదో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రబుత్వం కూలిపోతుందని భయపడి పిలవడం లేదా.
()నీకు పోలీసులున్నారు, నాకు పోలీసులున్నారు..నీకు సీఐడీ ఉంది, నాకు సీఐడీ ఉంది అంటూ బాబు మాట్లాడడం చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదు.  మీ కోసమా, ప్రజల కోసమా బాబు వారుంది . పోలీసులు, సీఐడీ నాకోసం పనిచేయాలని మాట్లాడడంలో ఆంతర్యమేమిటి. 
()ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య గురించి, గ్యాంగ్ స్టర్ నయీం గురించి సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు
()నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని ఆరోపణలు వస్తున్నాయి.  విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకొస్తాయి
() తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రహస్య అవగాహనతో  ఓటుకు నోటు కేసును నీరుగారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులపై సీబీఐ విచారణ జరిపించాలి.
() స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే నయీంతో సెటిల్ మెంట్ చేసుకోమన్నాడంటే.. ఇంకెంతమంది ఆంధ్రా మంత్రులకు నయీంతో సంబంధాలు ఉన్నాయో.
()రాజధాని పేరుతో జరుగుతున్న భూకుంభకోణాల వెనుక  ఎంతమంది నయూంలున్నారోనని భయమేస్తోంది. బిల్లీరావు, తెల్గీ వంటివాళ్లను తయారుచేసింది చంద్రబాబేనని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top