జైల్లో ఉండడానికి మాత్రమే బాబు అర్హుడు

  • ఏ ఇంట్లో ఉండడానికి బాబు అర్హుడు కాదు
  • గాంధీ జయంతి రోజు కూడ పచ్చి అబద్ధాలు 
  • మరోసారి ప్రజలను మోసగించేందుకు పన్నాగం
  • అబద్ధాల్లో బాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ 
  • ఉమ్మడి రాష్ట్రంలో 48లక్షల ఇళ్లు కట్టించిన ఘనత వైయస్ఆర్ ది
  • ఏడాదికి 10వేల ఇళ్లు కూడ కట్టించలేని దౌర్భాగ్యపు స్థితిలో బాబు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ
హైదరాబాద్ః  ప్రజా సొమ్మును దిగమింగుతూ చంద్రబాబు మోసపూరిత పాలన సాగిస్తున్నాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాంధీ జయంతి రోజు కూడ బాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల్లో చంద్రబాబు గిన్నీస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మజ మాట్లాడారు. తన సొంత నివాసాలు, గెస్ట్ హౌస్ లకు మరమ్మతుల పేరుతో వందల కోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప బాబు పేదవాడికి ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోవడం లేదని దుయ్యబట్టారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో, మరోసారి ప్రజలను మోసగించేందుకు ....లక్ష గృహప్రవేశాలు చేశాను, మరో 17లక్షల కొత్త ఇళ్లు చేపట్టబోతున్నానంటూ బాబు పన్నాగం పన్నుతున్నారని పద్మజ ధ్వజమెత్తారు.  

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారని...ఏపీలో 27లక్షలు వరకు చేపట్టారని పద్మజ గుర్తు చేశారు. ఏడాదికి 10వేల ఇళ్లు కూడ కట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న చంద్రబాబు రాబోయే ఏడాదిలో 17లక్షల ఇళ్లు కడతానని చెప్పడం పచ్చి మోసం, దగాయేనని అన్నారు. ఎన్నికల కోసం బాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టాడన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్కదాన్నైనా నెరవేర్చారా..? ఎందుకు పదే పదే అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  3సెంట్ల భూమిలో లక్షన్నర వ్యయంతో ఇళ్లు కట్టిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా దాని ఊసేలేకపోగా... నిర్మాణంలో ఉన్నవాటిని కూడ ఆపేసిన ఘనుడని విమర్శించారు.  నాలుగు బడ్జెట్ లలో ఏ మాత్రం కేటాయింపులు జరపకుండా,  2014వరకు జరిగిన ఇళ్ల నిర్మాణాలు కూడ నిలిపేయాలని ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి ఒక్క బాబు మాత్రమేనని మండిపడ్డారు. 

కుమారుడికి మంత్రి పదవికోసం చూపిన శ్రద్ధ బాబుకు పేదలపై లేదని పద్మజ అన్నారు.  పేదలకు ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలన్న చిత్తశుద్ధే  లేదన్నారు. సొంత ఆస్తుల మరమ్మతులకు వందల  ఖర్చుపెట్టిన ఈ పెద్దమనిషి(చంద్రబాబు)ఆ ఇంట్లో కూడ  తన కుటుంబసభ్యులను నివాసం ఉంచకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రభుత్వ ధనంతో అద్దెలు కడుతూ దుర్వినియోగం చేస్తున్నారని పద్మజ నిప్పులు చెరిగారు. సంవత్సరానికి 5లక్షల పై చీలుకు పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన వైయస్ఆర్ పాలనకు...కేవలం 10వేల ఇళ్లు కూడ చేపట్టని బాబు పాలన తీరును ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు. బాబు మాటలను ప్రజలు నమ్మరని పద్మజ స్పష్టం చేశారు.  గ్రాఫిక్స్ లో రాజధానిని చూపించినట్టే , రాబోయే ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు బాబు మళ్లీ పన్నాగం పన్నుతున్నాడన్నారు. విజయవాడలో అక్రమ నిర్మాణంలో నివాసముంటూ బాబు నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా నోటీసులు అందుకున్న తర్వాత కూడ సమాధానం చెప్పకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడన్నారు. బాబు గృహనిర్మాణాల మీద విచారణ చేపడితే  ఆయన బండారం మొత్తం బయటపడుతుందన్నారు. అప్పుడు ఆయన ఏ ఇంట్లో ఉండడానికి అర్హుడు కాదని,  జైలులో ఉండడానికి మాత్రమే అర్హుడవుతాడని విమర్శించారు.
Back to Top