వేలాడే గ‌బ్బిలం చంద్ర‌బాబు....!

తిరుపతి)) బంద్ సందర్భంగా మహిళలపై మగ పోలీసుల్ని ఉసికొలిపి దాడి చేయించిన
చంద్రబాబు తీరు గర్హనీయమని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన
కరుణాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. మహిళలపై దాడుల్లో దుశ్శాసనుల్ని తలపించే
మాదిరిగా వ్యవహరించారని అభివర్ణించారు. తిరుపతిలో పోలీసుల దాడుల తర్వాత ఆయన
మీడియాతో మాట్లాడారు.

ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ సీపీ చేపీ చేప‌ట్టిన బంద్ లో ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు అంద‌రూ స్వ‌చ్ఛందంగా
పాల్గొన్నార‌ని భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు.  బంద్ ను విఫ‌లం చేయ‌డం కోసం చంద్ర‌బాబు నానా క‌ష్టాలు
ప‌డ్డార‌ని అయినా బంద్ విజ‌య‌వంత‌మైంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం
వైయ‌స్ జ‌గ‌న్  ఆదేశాల మేర‌కు చేప‌ట్టిన
బంద్ లో టీడీపీ ప్ర‌భుత్వం చూలా క్రూరంగా ప్ర‌వ‌ర్తించింద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్
కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని వెంక‌టేశ్వ‌ర స్వామి మీద ప్ర‌మాణం చేసి ఇప్పుడు పార్ల‌మెంటు
సాక్షిగా ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం మాట మార్చితే దానిపై నిర‌స‌న‌
వ్య‌క్తం చేయ‌కుండా చూరుప‌ట్టుకుని వేలాడే గ‌బ్బిలంలా చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని
ఆయ‌న విమ‌ర్శించారు. నిరంతర పోరాట‌శీలి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో వేలాది మంది ప్ర‌జ‌లు, వైయ‌స్ఆర్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సూర్యోదయం కాక‌మునుపే రోడ్ల‌పైకి
వ‌చ్చి హోదా కోసం పోరాటం చేస్తుంటే.. పోరాటాలంటే భయ‌ప‌డే చంద్ర‌బాబు కర్కశంగా
వ్యవహరించారన్నారు. తిరుప‌తిలో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌మాణం చేసి ఇదే తిరుప‌తిలో
ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ఆడ‌వారి ప‌ట్ల దుశ్శాసనుల మాదిరి ప్ర‌వ‌ర్తించ‌డం
బాధాక‌ర‌మ‌న్నారు. ఆడ‌వాళ్ళ చీర‌లు లాగి, ర‌విక‌లు చింపి, తాళ్లి బొట్లు తెంపి,   మ‌గ‌పోలీసులతో దాడులు చేయించ‌డం చాలా ఘోర‌మ‌న్నారు.
 స్త్రీలు ప్ర‌తిఘ‌టించ‌కూడదు, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌కూడ‌ద‌ని
పుస్తెలు తెంపి అవమాన పరిచి హింసించారని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక మ‌హిళా
ఎస్పీ కి ఆదేశాలు ఇచ్చి మగ పోలీసుల చేత ఇవ‌న్నీ చేయించారని అన్నారు. దీనిపై చంద్ర‌బాబు
స్పందించ‌కుండా పార్టీ నాయ‌కుల చేత ఈ చ‌ర్య‌ను నాట‌కంగా చిత్రించే ప్ర‌య‌త్నం
చేస్తున్నారంటే.. చంద్ర‌బాబు  స్త్రీల‌ను ఎంత హీనంగా చూస్తున్నారో అర్థమ‌వుతుంద‌ని
అన్నారు. చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌ల్లో స్త్రీల‌కు భ‌ద్ర‌త అందిస్తా
అని చెప్పి ఇప్పుడు ఇలా చేయించాడు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కు సంబంధం లేదు అంటున్న
కొంద‌రు వ్య‌క్తులు చంద్ర‌బాబు అనుమ‌తి లేనిదే పోలీసు వ్య‌వ‌స్థ ఇంత‌లా వ్య‌వ‌హ‌రిస్తుందా
అని ఆయ‌న  ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు త‌ల వంచి క్ష‌మించండి అని ప్రార్థించాల‌ని
ఆయ‌న నిలదీశారు. అలా చేయ‌కుంటే త‌ప్ప‌క చంద్ర‌బాబు కి మహిళల ఉసురు త‌గులుతుంది అని
భూమన‌ అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు `అప్పులు తీరుస్తా.. బ్యాంకుల్లో ఉన్న మీ న‌గ‌లు
విడిపిస్తా.. అనుభ‌వంతో  నేను మీకు అది
చేస్తా అన్న`
చంద్ర‌బాబు
 ఇప్పుడు స్త్రీల‌కు ఏం చెబుతారో చెప్పాల‌ని  నిల‌దీశారు. చంద్ర‌బాబు
అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. విలేక‌రుల స‌మావేశం లో చంద్ర‌బాబు
మాట్లాడుతూ.. సీఎంను ప్ర‌ధాన మంత్రి కేసులు పెట్టారా అని అంటున్నారు..కానీ చంద్ర‌బాబు
 రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి  పీఎం  కాళ్ళ‌పై ప‌డ్డాడు కాబ‌ట్టే
ఇంకా మిగిలి ఉన్నాడు  అన్నారు. చెంబు దొంగ‌నే అరెస్టు చేస్తుంటే 20 కోట్లు డీల్ చేస్తూ దొరికి పీఎం కాళ్లు ప‌ట్టుకున్నాడు
 కాబ‌ట్టే ఆయ‌న్ని వ‌దిలేశార‌న్నారు. చంద్ర‌బాబు సోనియా క‌ల‌సి వైయ‌స్ జ‌గ‌న్
పై కేసులు పెట్టించార‌న్నారు.

`మ‌హిళా ఎస్పీ ని నియ‌మించ‌డంతో నేను చాలా
ఆనందించా.. కానీ ఆమెను తెలుగు దేశం పార్టీవారు వాళ్ళ‌వైపు తిప్పుకున్నారు. అమాయ‌క‌పు
పోలీసుల‌పై మేము చ‌ర్య‌తీసుకోమ‌ని చెప్పము. ఎందుకంటే అది చేయించింది చంద్ర‌బాబ‌ని
అంద‌రికీ తెలుసు`
అని అన్నారు.

 

Back to Top