ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి బాబు అన‌ర్హుడు

  • ప్ర‌త్యేక హోదా ఇచ్చే ఆలోచ‌న మోడీకి లేదు
  • ప్ర‌త్యేక హోదా తీసుకురావాల‌న్న ధ్యాస బాబుకు లేదు
  • హోదాకోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్సీపీ
  • చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదు...వెంటనే దిగిపోవాలి
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

హైదరాబాద్ః  కాంగ్రెస్ పార్టీ అత్యంత అరాచ‌కంగా, దుర్మార్గంగా, పాశ‌వికంగా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించి శవంగా మారితే... ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌కుండా టీడీపీ పార్టీ జీవ‌చ్ఛవంలా మారింద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తిరుప‌తిలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటే.... దానికి చంద్ర‌బాబు ప‌దేళ్లు కాదు... ప‌దిహేను సంవ‌త్స‌రాలు కావాల‌ని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇరు పార్టీలు ప్ర‌జ‌ల‌ను అడ్డంగా మోసం చేశాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా సాధించి అభివృద్ధిలో ముందంజ‌లో ఉన్నాయ‌న్న విష‌యం బాబు తెలుసుకోవాల‌ని సూచించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.  

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాటల్లోనే....
* ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో హామీల‌ు ఇచ్చి  మోసం చేసిన టీడీపీపై ఎప్పుడెప్పుడు ప్ర‌తీకారం తీర్చుకుందామ‌ా అని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు.
* టీడీపీ,బీజేపీలు త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఏపీకి ప్ర‌త్య‌క‌హోదా ఇస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పాయి.
* ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌లు ఎన్నో పోరాటాలు... ఆందోళ‌న‌లు చేసినా బాబుకు విన‌ప‌డ‌టం లేదు.
* ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాదు... ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రాభివృధ్ధి జ‌ర‌గ‌దు అని చెబుతున్న టీడీపీ ముఠా సిగ్గుతో త‌ల‌దించుకోవాలి
* ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ఎన్నో నిధులు తీసుకొస్తాన‌న్న బాబు హామీ ఏమైంది.

ప్ర‌జాగ్ర‌హానికి గురైతే అంతే....
* ఉమ్మ‌డి రాష్ట్రాన్ని ప్ర‌జల అభిప్రాయానికి వ్య‌తిరేకంగా విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ శవంగా మారి.. ప్ర‌జల నిర‌ాధార‌ణ‌కు గురైంది
* ఊపిరి లేని కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లును ప్ర‌వేశ‌పెడితే దానికి టీడీపీ మేము సైతం చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న‌డం విడ్డూరం
* ప్ర‌త్యేక హోదా అన్నది క్యాబినెట్ నిర్ణ‌య‌మ‌ని తెలిసి కూడా టీడీపీ ప‌ట్టుబ‌ట్ట‌కపోవడం దారుణం.
* ప్ర‌త్యేక హోదా ఇచ్చే ఆలోచ‌న మోడీకి లేదు... అడ‌గాల‌న్న ధ్యాస చంద్రబాబుకు లేదు...
* ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే త‌మ పాలిత రాష్ట్రాల్లో ఉన్న‌ట్టువంటి ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఏపీకి త‌ర‌లివెళ్తాయ‌న్న భ‌యంతోనే మోడీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం లేదు..

ప్ర‌త్యేక హోదా కోసం పోరాడి అరెస్ట్ అయిన ఏకైక వ్యక్తి వైయ‌స్ జ‌గ‌న్‌..
* ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించ‌వ‌ద్ద‌ని ఎన్నో ఆందోళ‌నలు చేసిన ఏకైక పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ
* విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో నాలుగు ల‌క్ష‌ల మందితో నిర‌స‌న తెలిపిన ఘ‌న‌త వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీదే
* విభ‌జ‌న అనంత‌రం ప్ర‌త్యేక హోదా కోసం అనేక మార్లు దీక్ష చేసిన ఏకైక నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
* ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో క‌లిసి ఢిల్లీలో నిర‌హార దీక్ష చేసి అరెస్ట్ అయ్యారు. మరెన్నో ఉద్యమాలు చేశారు.

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు అనర్హుడు..
* బాబు ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి  ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల గొంతు కొయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. 
* ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై నేను పోరాడ‌ను.. ఒత్తిడి చేయ‌ను అనే ముఖ్య‌మంత్రి రాష్ట్రానికి అవ‌స‌రామా..?
* ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయ‌లేని వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌డానికి అన‌ర్హుడు...
* విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్టంగా ఉన్న పెట్రోలియం యూనివ‌ర్సిటీ... గిరిజ‌న యూనివ‌ర్సిటీ.... చెన్నై- వైజాగ్ ఇండ‌స్ట్రీయ‌ల్ క్యారిడ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు ఏర్పాటు కాక‌పోవ‌డం సిగ్గుచేటు...
* తిరుప‌తిని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా ప్ర‌క‌టించి... సాక్ష్యాత్తు ప్ర‌ధాని మోడీ దానిని ప్రారంభించి దాదాపు ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఒక్క ప్ర‌యాణం కూడా ప్రారంభం కాలేదు
* అమ‌రావ‌తిలో మెట్రో రైలు ఊసే లేదు... తుంగ‌రాజుప‌ట్నంను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. దానికి స్పంద‌న లేదు...
* రాజ్య‌స‌భ‌లో టీడీపీ నేత‌లు పాట‌లు ప‌ాడితే ప్ర‌త్యేక హోదా రాదు
* కేవీపీ  ప్రైవేటు మెంబర్ బిల్లును ఉప‌సంహరించుకుంటే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్నార‌ని చెప్ప‌డం హేయనీయం
* చంద్ర‌బాబుకు రాజ‌కీయ సంక‌ల్పం లేక‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రావ‌డం లేదు...
* ఒక్క ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్ని రంగాల్లో రాణిస్తుంది... దేశంలో 11 రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా ద్వారా అభివృద్ధిలో ముందుంటున్నాయి...
* ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే మేము రాజీనామా చేస్తామ‌ని టీడీపీ మంత్రులు, ఎంపీలు చెబితే క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా వ‌స్తుంది.
* ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌ని ప‌రిస్థితి వ‌స్తే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే అర్హ‌త త‌న‌కు లేద‌ని రాజీనామా చేసేందుకు బాబు సిద్ధంగా ఉండాలి

తాజా వీడియోలు

Back to Top