దేవుడినీ వదలని చంద్రబాబూ

అర్చకులకు 65 ఏళ్ల వయో పరిమితి విధించడం ఏంటీ?
చంద్రబాబు సర్కార్‌ వెంకన్న ఆలయానికి పట్టిన రాక్షసభూతం
తప్పులు బయటపడతాయనే పండితులపై వయోపరిమితి వేటు
మసీద్, చర్చిల్లో ఉండే పెద్దలకు వయస్సుతో సంబంధం ఉందా..
హిందువే.. హిందూ సంస్కృతిపై దాడి చేయడం సిగ్గుచేటు
చంద్రబాబు దుశ్చర్యపై మఠాధిపతులు, పీఠాధిపతులు ఉద్యమించాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌:  దైవభక్తి ముసుగులో చంద్రబాబు వెంకటేశ్వరస్వామిని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. 
వెంకన్న మా ఇళవేల్పు అని నిరంతరం చెప్పుకుంటూ తన మోసాలకు దేవుడినే పావుగా వాడుకుంటున్నాడని ఆరోపించారు. కలియుగ దైవంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ జరగనంతగా తీవ్రమైన అపచారాలు జరుగుతున్నాయన్నారు.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది సంవత్సరాలుగా అర్చక వారసత్వాన్ని కలిగిన పడితల్లి, గొల్లపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి నాలుగు కుటుంబాలకు సంబంధించి భరద్వాజ గోత్రికులు క్షేత్రంలో విలువల పట్ల అపచారం, శ్రీవారి కైంకర్యాల్లో అన్యాయం జరుగుతుందని, భగవంతుడిని ఆదాయ వనరుగా చూడడం తప్పితే. భగవంతుడిగా చూడడం తగ్గించారని, వీఐపీలకు, కావాల్సిన వారికి బార్లా తెరిచి సపరియలు చేసే సత్రంగా మారుస్తున్నారని బాధతో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అనేక రకాల సందేహాలను లేవనెత్తితే.. వాటికి సమాధానం చెప్పాల్సిన టీటీడీ పాలక మండలి ఆయనపై వేటు వేసేందుకు సిద్ధపడిందని మండిపడ్డారు. 

బరితెగించిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న టీటీడీ ధర్మకర్తల మండలి అధర్మకర్తలు రెండు సంవత్సరాలు పదవిలో ఉండే పాలక మండలి. రెండు వేల సంవత్సరాలకు పైగా స్వామివారికి సేవ చేస్తున్న అర్చకులపై దారుణమైన నిందలు వేసి హిందువుల మనోభావాలను తెంచివేసిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయంగా విరాజిల్లుతూ.. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన క్షేత్రాన్ని నరకంగా మారుసతున్న చరిత్ర చంద్రబాబుదన్నారు. 65 ఏళ్లు నిండిపోయాయని ఆలయ వ్యవహారాలు సరిగ్గా జరగడం లేదని ఆవేదన చెందిన రమణ దీక్షితులపై చర్య తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధపడడం దుర్మార్గమన్నారు. హెరిటేజ్, ఎన్టీఆర్‌ ట్రస్టులో ప్రధాన భూమిక పోషిస్తూ డైరెక్టర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్న 90 ఏళ్ల దేవినేని సీతారామయ్య ఇంకా ఎందుకు ఉన్నారన్నారు. 
 
ఆచారాలపై చట్టాల పెత్తనం ఉండకూడదని బ్రిటీష్‌ ప్రభుత్వం కూడా కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చిందని భూమన గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పరిపాలన వెంకటేశ్వరస్వామిని కూడా వదలడం లేదని, భూతంలా సంప్రదాయాలను తుంగలో తొక్కుతుంది. తనకు కావాల్సిన తొత్తులు, కాలనాగులు, పాపాల పుట్టలను బోర్డు సభ్యులుగా నియమించి గుండాగిరి చేసే వ్యవహారంగా పాలకమండలిని మార్చి సమున్నత ఔన్నత్యాన్ని చిద్రం చేసే కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకుందన్నారు. 

40కి పైగా దేవాలయాలు కూల్చివేస్తే దిక్కులేదు.. అమరేశ్వరుడి ఆలయ భూములను అతికారుచౌకగా కొట్టేసే కార్యక్రమాలు, పాదరక్షలతో పూజలు ఇలాంటి ఎన్నో ఘోరాలు చేసిన చంద్రబాబు చివరకు బ్రాహ్మణులపై తన ఉక్కుపాదం చేస్తున్నాడు విషయాలు కూడా అనేక సందర్భాల్లో చూశాం. అపారమైన విశ్వాసం ఉందని చెప్పి ముసుగులో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కాదదన్నారు. దేవుడితో పెట్టుకున్న చంద్రబాబుకు ఎనిమిదేళ్ల్ల క్రితం అలిపిరిలో దాడి జరిగినా బుద్ధి రాలేదన్నారు. 

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఏవిధంగా క్షుద్రపూజలు చేశారో.. అలాంటి అనాగరిక పూజలు వెంకటేశ్వరుడి స్వామి ఆలయంలో జరిగాయని పండితులు చెబుతారని గ్రహించిన చంద్రబాబు తన నిజస్వరూపం బయటపడకుండా వారిపై వేటు వేశారని భూమన ధ్వజమెత్తారు. మక్కా, జుమ్మా మసీద్‌లలో ఉన్న ఇమామ్‌లకు వయస్సుతో పనిలేదు. ఇటలీలో ప్రసిద్ధి చెందిన చర్చిలో ఉండే పోప్‌కు వయస్సుతో పనిలేదు.. కానీ వేదపండితులకు వయో పరిమితి విధించడం ఏంటని ప్రశ్నించారు. హిందువుల ఆచారాలపై వేరెవరో కాదు.. హిందువులే దాడి చేస్తున్నారని, వేదపండితుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సాంప్రదాయాల మీద.. తరతరాల సంస్కృతిపై దెబ్బతీయడం హిందుత్వంపై జరగుతున్న దాడిగా భావించాలన్నారు. హిందూతనం బతకాలంటే మఠాధిపతులు, పీఠాధిపతులు దీనిపై వెంటనే అప్రమత్తమై దాడి మీద ఉద్యమించాల్సిందిగా వైయస్‌ఆర్‌ సీపీ కోరుతుందన్నారు.  
Back to Top