కుక్కకు ఉన్న విశ్వాసం కూడా బాబుకు లేదు

కర్నూలుః హోదా కోసం పోరాడుతుంటే విద్యార్థులు చెడిపోతున్నార‌ని బాబు అంటున్నారు. కానీ వారి ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మార్వోలను కొట్టొచ్చు.. మంత్రుల కొడుకులు నడిరొడ్డుమీద అమ్మాయిలను అసభ్యంగా వేధించవచ్చు. అదేమంటే కుక్క అడ్డు వ‌చ్చింద‌ని చెబుతారు. ఇక లోకేష్‌ విదేశాల్లో మందు తాగుతూ అమ్మాయిలతో జ‌ల్సాలు చేయ‌వ‌చ్చు. కానీ మేము మాత్రం హోదా కోసం పోరాడకూడదంట. కుక్క‌కైనా విశ్వాసం ఉంటుంది కానీ బాబుకు లేదు. మా ఓట్లతో గెలిచి ఇప్పుడు మాకే వెన్నుపోటు పొడుస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..చంద్రబాబుకు పిచ్చి పట్టిందని నిప్పులు చెరిగారు. కనీసం మీ మాటలు విన్న త‌ర్వాత‌నైనా బాబుకు బుద్ధిరావాలని భగవంతుడిని కోరుకుందామన్నారు.

Back to Top