చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు

పుంగ‌నూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పదవికి ఏమాత్రం అర్హుడు కాదని
మాజీ మంత్రి, వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అభిప్రాయ పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 దేశీయ నిపుణుల‌ను, మేధావి వ‌ర్గాన్ని ప‌క్క‌న బెట్టి బాబు ఎందాకా సింగ‌పూర్, మ‌లేషియా అంటూ ప‌రిగెడుతున్నార‌ని పెద్దిరెడ్డి
రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. ప‌రిపాల‌న‌లో కూడా విఫ‌ల‌మైయ్యార‌ని, ఆయ‌న సీఎం ప‌ద‌వికి అర్హుడు కాద‌ని అన్నారు.
వెంట‌నే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి స‌మ‌ర్ధుడైన వారికి సీఎం ప‌ద‌వి అప్ప‌గిస్తే
రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దేశంలో ఎంతోమంది నిపుణులు ఉన్నార‌ని
వారిని విదేశాల వారు వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.అలాంటి
నిపుణులైన ఇంజ‌నీర్ల‌ను అవ‌మానిస్తూ చంద్ర‌బాబు రాజ‌ధాని నిర్మాణ ప‌నులు
 విదేశీ కంపెనీలకు అప్ప‌జెప్ప‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌ని అన్నారు. చంద్ర‌బాబు
నాయుడుకి త‌న వారిని,
త‌న ప్రాంతాన్ని
గౌర‌వించే అల‌వాటులేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప‌ది సంవ‌త్స‌రాలు
ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉండేందుకు అనుమ‌తి ఇచ్చినా చంద్ర‌బాబు రాజ‌ధాని నిర్మాణం పేరిట
విహార‌యాత్ర‌లు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

Back to Top