బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదు

విశాఖపట్నం : వైయస్సార్సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి  చంద్రబాబుపై విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లోపించిందని మండిపడ్డారు. బాబు తన స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీతో సావాసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆగస్టు 2వ తేదీన వైయస్సార్సీపీ తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి చేశారు.


Back to Top