వ్యవసాయ సంక్షోభం పట్టదా బాబూ?

ప్రాజెక్టులపై చంద్రబాబువన్నీ అసత్యాలే

కరవు పరిస్థితులున్నా పట్టని సర్కార్

పంటలు ఎండిపోతున్నాయ్ మీ రెయిన్ గన్ లు ఎక్కడ

వైయస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షులు
నాగిరెడ్డి

విజయవాడ : రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తూ పైర్లు ఎండిపోతున్నా
ప్రబుత్వానికి పట్టడం లేదని,  వైయస్ ఆర్
కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. విజయవాడ పార్టీ
కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతారాహిత్యంగా
 అసత్యాల ప్రచారం చేసుకుంటూ, వ్యవసాయాన్ని
సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎవరూ చెప్పనట్లుగా ఈయన
హయాంలో భూగర్భంలో దాదాపు 381 టిఎంసిల నీటిని తేమ రూపేణా నిల్వ చేసినట్లు చెప్పుకోవడం
వింతగా ఉందన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం 813 టిఎంసిలనీరు అందుబాటులో
ఉందని ప్రకటిస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ట్రిబ్యునల్ కేటాయించిన
నీళ్లే 811 టిఎంసిలు కాగా, అందులో 297 టిఎంసిల నీరు తెలంగాణకు పోగా మిగిలిన దెంతో అందరికీ
అర్థమవుతోందన్నాురు. రాయలసీమ జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో
తీవ్రమైన సాగునీటి సంక్షోభం ఉందన్నారు. పైర్లు ఎండిపోతున్నాయన్నారు.

పట్టి సీమతో కృష్ణా డెల్టాతో పాటు, రాయలసీమను
కూడా సశ్యశ్యామలం చేశామంటూ చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల్లోనూ
కరువు తాండవించడంపై ఏ సమాధానం చెపుతారని నిలదీశారు.  అసలు పట్టిసీమకు ఆనుకుని ఉన్న కృష్ణా
డెల్టాలోని పలు మండలాల్లో తీవ్రమైన సాగునీటి కొరత ఉంటే, ఇక ఆ ప్రాజెక్టుతో రాష్ట్ర
మంతటికి నీళ్లిచ్చామని చెప్పుకోవడం అర్థం లేదన్నారు. మీ రెయిన్ గన్ లు ఏమయ్యాయో,
వాటి ద్వారా నీటిని ఎందుకు సమకూర్చడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  కేవలం ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్ర స్థాయిలో
వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఏఒక్క కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం
చేపట్టడం లేదన్నారు. దేశంలో ఎక్కడాలేనట్లుగా వ్యవసాయంలో రెండు అంకెల వృద్ధి రేటు
అని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్డియే లో భాగస్వామ్యమై, ఆ
పార్టీ ఎంపిలు కేంద్ర మంత్రులుగా ఉన్న సమయంలోనే స్వామినాథన్ సిఫారసులను అమలు
చేయలేమంటూ కేంద్ర ప్రబుత్వం ప్రకటించినా, చంద్రబాబు మాట్లాడలేదన్నారు.  కానీ ఇప్పుడు మాత్రం స్వామినాథన్ సిఫారసులను
అమలు చేస్తామంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు.

అధికారంలోకి రాగానే ప్రతి ఏటా వెయ్యి కోట్లతో ధరల
స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన చంద్రబాబునాయుడు , చివరి ఆరు నెలల
కాలంలో కేవలం నామమాత్రం 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం వంచన కాక
మరేమిటిని నాగిరెడ్డి ప్రశ్నించారు. గత ఏడాదిలోనే రైతాంగం దాదాపు 15 వేల కోట్లకు పైగా
విలువైన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రాక 
అల్లాడిపోయారన్నారు.

అంతే కాకుండా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా
చంద్రబాబు ప్రచార ఆర్భాటం తప్ప చేసిందేమీ లేవన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును
ఎన్టీఆర్ ప్రారంభిస్తే, తాను పూర్తి చేస్తున్నానంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని,
ఎన్టీఆర్ హయాంలోఆ ప్రాజెక్టు పేరుపెడితే, 9 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు రెండు
సార్లు శంఖుస్థాపనలు చేయడం మినహా చేసిందేమీ లేదన్నారు. వాస్తవంలో హంద్రీనీవా
పనులన్నీ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తి స్థాయిలో చేపట్టారని టిడిపి కార్యకర్తలను
అడిగినా చెపుతారన్నారు. చంద్రబాబు నాయుడు ఇకనైనా ప్రచార ఆర్భాటాలను పక్కకుబెట్టి
క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని ఆదుకునే దిశలోచర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top