చంద్రబాబు మారని మనిషి


గుంటూరు: 600 అబద్ధపు హామీలు చెప్పిన చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాష్ట్ర సంపదను ఏవిధంగా దోచుకున్నారో చూశామన్నారు. చంద్రబాబు ఏ నాటికి కూడా మారని మనిషి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 134వ రోజు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు ఎవరు నమ్మరని, అన్ని వర్గాలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టారన్నారు. రాజన్న రైతులను రాజులా చూశారని, చంద్రబాబు ఆ రోజు వ్యవసాయం దండగ అన్నారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా 33 వేల ఎకరాల భూమిని లాక్కున్నారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. మంగళగిరిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేదని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నిమార్లు మీకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు రైతులను, కూలీలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు మనస్సు ఉంటే వైయస్‌ జగన్‌ చూపిస్తున్న మార్గంలో నడవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటూ పన్నులు కడుతున్న ప్రజలను ఖాళీ చేయించింది వాస్తవం కాదా అన్నారు. చంద్రబాబు అన్యాయంగా అక్రమించుకున్న ఇంట్లో నివాసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి చేశారో 31వ వార్డులో జరిగిన ఉప ఎన్నిక నిదర్శనమన్నారు. ఎన్‌టీఆర్‌పేరుతో అన్నా క్యాంటీన్‌ పెడతానని మాట తప్పారన్నారు. మా రాజన్న పేరుతో మంగళగిరిలో పెద్ద మనస్సుతో రాజన్న క్యాంటీన్‌ నడుపుతున్నామని గుర్తు చేశారు. 
Back to Top