బాబుకు పేదల బాధలే పట్టడం లేదు

 • అమరావతి జపం చేస్తూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారు
 • తక్షణమే ఉరవకొండ అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు కేటాయించాలి
 • స్థానిక ప్రజలతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి మహాధర్నా

అనంతపురం(ఉరవకొండ): టీడీపీ సర్కార్ కు  పేద ప్రజల బాధలే పట్టడం లేదని వైయస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి జపం చేస్తూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉరవకొండ అభివృద్ధి పనులకు తక్షణమే రూ.50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశ్వేశ్వర్ రెడ్డి మహాధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....

 • అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపుమేరకు ఇప్పటికే గడపగడప తిరుగుతున్నాం. ఉరవకొండలో ఎక్కడ చూసినా హృదయం కలిచివేసే సంఘటనలే
 • తాగునీరు లేక ప్రజలు బురదనీళ్లు తాగుతున్న పరిస్థితి. కలుషిత నీటితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
 • డ్రైనేజీలు లేక అనేక కాలనీల్లో ఇళ్లలోకి మురుగు నీరు చేరుతుంది
 • చేనేత కార్మికులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. రుణాలు మాఫీ కాలేదు. వాళ్లకు వచ్చే సబ్సిడీలు కూడా బాబు రద్దు చేశారు. 
 • దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉరవకొండలో చేనేతల కోసం 89 ఎకరాల భూమి సేకరించారు. 
 • ఇంత భూమి చేతిలో ఉన్నా అందులో కంప చెట్లు పెంచుతున్నారు తప్ప బాబు వారికి ఇంటిస్థలం ఇవ్వడం లేదు
 • రెండేళ్లుగా చూసి చూసి బాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు. 
 • స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గతంలో 30 గంటలపాటు పార్టీ నేతలతో కలిసి దీక్షలు చేశాం. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు
 • సామూహిక లెట్రిన్స్ పడగొట్టారు. కొత్తవి శాంక్షన్ చేయడం లేదు. ఆరోగ్యం బాగోలేక పోతే ఎటుపోవాలో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
 • ముఖ్యమంత్రి, కలెక్టర్, అధికారులకు అందరికీ విన్నవించాం. అయినా కదలిక లేదు.
 • జపాన్, సింగపూర్, చైనా అని తిరుగుతున్నాడు తప్ప బాబు ప్రజలకు ఏమీ చేయడం లేదు. 
 •  పైసా పెట్టనవసరం లేదు. ఉన్న భూమినే ఇవ్వమని ప్రజలు కోరుతున్నారు. 
 • తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.  ఇళ్లు అడుగుతున్నాం. మంచి నీళ్లు ఇవ్వమని అడుగుతున్నాం. 
 • ఉరవకొండలో పరిస్థితులుఎంత దారుణంగా ఉన్నాయో చూడమని కోరుతున్నాం. 
 • వర్షం సైతం లెక్కచేయకుండా ప్రజలు ధర్నాలో కూర్చున్నారంటే వారు ఎంత ఆవేదన చెందుతున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.  
 • పట్టుదలకు పోకుండా, రాజకీయం చేయకుండా ఉరవకొండ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. సమస్యలు పరిష్కరించేవరకు పోరాడుతాం. 
Back to Top