గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్న బాబు

నెల్లూరు: గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన దుర్మార్గపు పాలన టీడీపీదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. గిరిజన ఎమ్మెల్యేలంతా వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్నారని చంద్రబాబు అక్కసు చూపుతున్నాడని మండిపడ్డారు. కేబినెట్‌లో గిరిజన మంత్రి కూడా లేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడన్నారు. ఎస్టీలకు జరుగుతున్న అన్యాయంపై గిరిజనులంతా ఏకమై తిరుగుబాటుకు సిద్ధం కావాలని కోరారు. ఓటుకు చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. 
Back to Top