ఉద్యోగుల సమస్యలు పట్టని బాబు

అనంతపురం: చంద్రబాబుకు ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు.  రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, 10వ పీఆర్సీ బకాయిలు ఇవ్వలేదన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్‌పై పోరాడాల్సిన అశోక్‌బాబు రాజకీయ నేతగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top