మోడీ బాబు జోడి రాష్ట్రాన్ని దగా చేసింది

రాష్ట్రానికి
తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు వీఆర్ కళాశాల మైదానాంలో వంచన పై గర్జన దీక్షను
ప్రారంభించారు. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు
పాల్గొన్నారు.  నాయకులంతా నల్లని దుస్తులు
ధరించారు. సాయంత్రం అయిదు గంటలవరకు జరగనున్న ఈ దీక్షను ప్రారంభిస్తూ పార్టీ
సీనియర్ నాయకులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మాట్లాడారు.  మోడీ, బాబు జోడీ రాష్ట్రాన్ని
అభివృద్ధి చేస్తుందంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాక దగా చేశారని ఆయన
విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల
అమలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎంతో చేస్తున్నామంటూ,
కేంద్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పిన
సంగతిని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజక్టుకు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు,
దుగరాజపట్నం, ప్రత్యేక రైల్వే జోన్ వంటివెన్నో ఇస్తారని చంద్రబాబు నమ్మబలికారని,
కానీ అవి వాస్తవ రూపం దాల్చకుండా వంచించారు. ఇవన్నీ రాకుండా, కేంద్రంలోని ప్రధాన
మంత్రి మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు లు కలిసి రాష్ట్రాన్ని నిలువునా ముంచారు.

ప్రత్యేక
హోదా పై అవగాహన కల్పించడానికి ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న యువభేరి వంటి కార్యక్రమాలకు
హాజరైతే కేసులుపెడతామని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ హెచ్చరిస్తూ చంద్రబాబు
హోదా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూశారన్నారు. అయితే అలుపురెగని పోరాటంతో ప్రజల్లో
చైతన్యం రావడంతో, బిజెపితో విడాకులు తీసుకున్న తరువాత చంద్రబాబు ప్రత్యేక హోదాపై
తానే పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటూ ప్రజలను మరోసారి వంచిస్తున్నారని
ఇటువంటి మోసపూరిత వైఖరిని ఖండిస్తూ నివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి నిరసనలు
చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 

Back to Top